Site icon HashtagU Telugu

Heat Wave: భానుడి భగభగలు.. రికార్డుస్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు!

Summer

Summer

ఏప్రిల్ మాసం మొదటి రెండు రోజుల్లోనే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బహుశా ఈ వేసవి సీజన్‌లో హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 44.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ మార్కును కూడా దాటింది. వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలంలో ఈరోజు గరిష్టంగా 44.8 డిగ్రీల సెల్సియస్‌, నిజామాబాద్‌లోని పలు చోట్ల 43 నుంచి 44.5 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బహదూర్‌పురాతో పాటు, చాలా GHMC ప్రాంతాలలో ఆదివారం ఉష్ణోగ్రతలు కొద్దిగా అటు ఇటుగా 39 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో ఖైరతాబాద్, సైదాబాద్, రాజేంద్రనగర్‌లో గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఉప్పల్, బోరబండతో సహా ఇతర ప్రాంతాల్లో 37.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వికారాబాద్‌లో గరిష్టంగా 44.8 డిగ్రీల సెల్సియస్‌, నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 43.6 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 44.7 డిగ్రీల సెల్సియస్‌ మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వనపర్తి, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి.