రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై (Heavy Rains ) CM రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అత్యవసర సమీక్ష నిర్వహించారు. ‘కలెక్టర్లు, SPలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ఎవ్వరు సెలవులు పెట్టొద్దు అని ఆదేశించారు.
అల్ప పీడన ప్రభావం తో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు , వంకలు ఉప్పంగిప్రవహిస్తున్నాయి. దీంతో అనేక చెరువులకు గండి పడి వరద ప్రవాహం ఇళ్లలోకి చేరాయి. అంతే కాదు అనేక చోట రహదారులు , రైల్వే ట్రాక్ లు తెగిపోయి రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 నిమిషాల మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటింది. అయినప్పటికి వాయుగుండం కారణంగా ఏర్పడిన భారీ మేఘాలు తెలంగాణ రాష్ట్రంపై విస్తారంగా కమ్ముకొని..చురుగ్గా కదులుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం , వరంగల్, హన్మకొండ, జనగామ సహా మిగతా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో అత్యధికంగా 29.98 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదయింది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. మహబూబాబాద్ జిల్లా ఇంగుర్తిలో 29.8 సెంటీమీటర్లు, నర్సింహులపేటలో 29.6 సెం.మీ. , దంతాలపల్లిలో 29.4 సెం.మీ., మరిపెడలో 29.1 సెం.మీ., కురవిలో 28.6 సెం.మీ., చినగూడులో 28.5 సెం.మీ., ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 29.6 సెం.మీ., సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో 28 సెం.మీ., మద్దిరాలలో 27.7, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 26.6 సెం.మీ., వరంగల్ జిల్లా నెక్కొండలో 25.9, సూర్యాపేటలోని మోతెలో 25.9 సెం.మీ., సూర్యాపేట జిల్లా చిలుకూరులో 29.7 సెం.మీ., చొప్పున వర్షపాతం నమోదయింది.
Read Also : Rishabh Pant: టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
