Site icon HashtagU Telugu

Telangana Pre Poll Survey 2023 : కారు స్పీడ్ కు బ్రేకులు..కాంగ్రెస్ జోరు..దరిదాపుల్లో లేని బిజెపి

Telangana Pre Poll Survey 2023

Telangana Pre Poll Survey 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections 2023 ) మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు.. ఎలక్షన్‌ కమిషన్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల తేదీలకు సంబంధించి ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. ఆ షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 7న (December 07) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్‌ 11న కౌంటింగ్‌ (December 11 Counting) నిర్వహించి… ఎన్నికల ఫలితాలు (Telangana Assembly Election Results ) ప్రకటిస్తారు. ఇది తాత్కాలిక షెడ్యూలు మాత్రమే. అయినప్పటికీ కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ క్రమంలో అన్నిపార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి..మేనిఫెస్టో మీద ఫోకస్ చేసింది. అటు కాంగ్రెస్ సైతం ఇప్పటీకే ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇక బిజెపి సైతం అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉంది. తాజాగా ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించి ఎన్నికల సమరానికి సై అనేసింది. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి సిద్ధమవుతుండగా..రాష్ట్రంలో ఎలక్షన్ సర్వే లు ఊపందుకున్నాయి.

ఎన్నికలు వస్తున్నాయంటే పలు సంస్థలు ప్రజల వద్దకు వెళ్లి సర్వేలు చేస్తుంటారు. ఏ ప్రభుత్వం రావాలి..?ఎవర్ని సీఎం గా కోరుకుంటున్నారు..? ఏ ప్రభుత్వమైతే బాగుంటుందని అనుకుంటున్నారు..? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని భావిస్తున్నారు..? అంటూ నియోజకవర్గాల వారీగా ప్రజలను పలు ప్రశ్నలు అడిగి వారి నుండి సమాదానాలు రాబడుతుంటారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలుకావడం తో పలు సంస్థలు సర్వేలు చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తెలంగాణ లో ప్రీ పోల్ సర్వే చేయగా..ఈ సర్వే లో అధికార పార్టీ కంటే..కాంగ్రెస్ పార్టీ కే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైజ్ గా సర్వే చేయగా..అధికార పార్టీ బిఆర్ఎస్ 45 – 51 , కాంగ్రెస్ 61 -67 , AIMIM
6 – 8 , బిజెపి 2 -3 , ఇతరులు 0 – 1 రావొచ్చని ఈ సర్వేలు తేలింది. అలాగే ఓటింగ్ శాతం కూడా చూస్తే..బిఆర్ఎస్ 39% – 42 %, కాంగ్రెస్ 41% -44% , AIMIM 3% – 4 %, బిజెపి 10 % – 12 %, ఇతరులు 3 % – 5 % . మరి నిజంగా ఈ సర్వే చెప్పినట్లే జరిగితే అధికార పార్టీ కి భారీ షాక్ తగిలినట్లే..ఒకవేళ AIMIM మద్దతు ఇచ్చిన అధికార పార్టీ అధికారంలోకి రావడం కష్టమే..అప్పుడు బిజెపి తో చేతులు కలిపితే బిఆర్ఎస్ అధికారం చేపట్టే అవకాశం ఉంది. కానీ బిజెపి బిఆర్ఎస్ తో చేతులు కలుపుతుందా..? అనేది చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

రెండుసార్లు బిఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలు..ఈసారి కాంగ్రెస్ ను పట్టం కట్టాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా కు కృతజ్ఞతగా ఒక్క ఛాన్స్ వారికీ ఇచ్చి చూద్దాం అన్న ధోరణి లో ప్రజలు ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా ఈసారి కీలక నేతలంతా కూడా బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతుండడం కూడా ప్రజల్లో కాంగ్రెస్ ఫై అభిమానం , నమ్మకం పెరిగేలా చేస్తుంది. ఇక బిజెపి విషయానికి వస్తే ఆరు నెలల క్రితం వరకు బిఆర్ఎస్ కు తగ్గ పోటీ బిజెపి అని చాలామంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డి కి అధ్యక్షా పదవికట్టబెట్టారో..అప్పటి నుండి ప్రజల్లో నమ్మకం పోతు వచ్చింది. ఇదే సర్వేలో పక్కాగా ప్రజలు చెప్పకనే చెప్పారు. ఓవరాల్ గా చూస్తే ఈసారి అన్ని సర్వే లలో కాంగ్రెస్ కే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్లు తేలుతుంది.

జిల్లాల వారీగా సర్వే రిపోర్ట్ ఇలా ఉంది.

Read Also : CM KCR: సింగరేణి కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్