Telangana : TRS కు మ‌ళ్లీ పురుడు, జూన్2న‌ ఆవిర్భావం!

జిగాడి గూడు మాదిరిగా తెలంగాణ (Telangana)రాజ‌కీయం అల్లుకుంటోంది. యాదృశ్చిక‌మా? వ్యూహాత్మ‌క‌మా? అనేది ప‌క్క‌న పెడితే,

  • Written By:
  • Publish Date - May 11, 2023 / 05:16 PM IST

గిజిగాడి గూడు మాదిరిగా తెలంగాణ (Telangana)రాజ‌కీయం అల్లుకుంటోంది. యాదృశ్చిక‌మా? వ్యూహాత్మ‌క‌మా? అనేది ప‌క్క‌న పెడితే, ఎన్నిక‌ల నాటికి చిన్నాచిత‌క పార్టీలు(New parties) బోలెడు క‌నిపించ‌బోతున్నాయి. తాజాగా పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy) కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌డానికి ముహూర్తం పెట్టుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం జూన్ 2న తెలంగాణ రైతు స‌మితి(టీఆర్ఎస్) పార్టీని ప్ర‌క‌టించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నార‌ని ఆయ‌న వ‌ర్గీయుల్లోని టాక్‌. అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయ‌ని స‌మాచారం.

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం జూన్ 2న తెలంగాణ రైతు స‌మితి(టీఆర్ఎస్) పార్టీ

కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పోటీప‌డి పొంగులేటి(Telangana) మీద ఆప‌రేష‌న్ చేశాయి. జాతీయ నేత‌లు నేరుగా ఆయ‌న కోసం ప్ర‌య‌త్నం చేశారు. కాంగ్రెస్ త‌ర‌పున ఢిల్లీ రాహుల్ టీమ్ లైజ‌నింగ్ చేసింది. బీజేపీ త‌రపున అమిత్ షా టీమ్ ప్ర‌య‌త్నం చేసింది. కానీ, ఆయ‌న రెండు జాతీయ పార్టీల‌కు స‌మ‌దూరంలో ఉన్నారు. ఇటీవ‌ల బీజేపీ వైపు మొగ్గుచూపిన‌ట్టు బ‌లంగా సంకేతాలు వచ్చాయి. ఊగిస‌లాట న‌డుమ ఒక స‌ర్వేను ప్ర‌త్యేకంగా ఆయ‌న చేయించార‌ట‌. అందులో 46శాతం మంది కాంగ్రెస్లో చేరాల‌ని, కేవ‌లం 18శాతం బీజేపీలోకి చేర‌మ‌ని అభిప్రాయం చెప్పార‌ని తెలిసింది. అందుకే, బీజేపీ చేర‌కుండా వెన‌క‌డుగు వేసిన పొంగులేటి(Ponguleti Srinivasa Reddy) కొత్త పార్టీ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని వినికిడి.

రెండు జాతీయ పార్టీల‌కు.పొంగులేటి స‌మ‌దూరం

ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. అందుకే, ఆయ‌న ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌ను టార్గెట్ గా పెట్టుకుని కొత్త పార్టీతో(Telangana) ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్నారని సమాచారం. ఇప్ప‌టికే. వ‌రంగ‌ల్ కు చెందిన ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్లు ఆయ‌నతో ట‌చ్ లో ఉన్నార‌ని వినికిడి. కొత్త పార్టీ పెడితే పొంగులేటితో క‌లిసి న‌డిచేందుకు సిద్దంగా ఉన్నార‌ని ప్ర‌చారం. ఇక న‌ల్గొండ జిల్లాకు చెందిన చ‌కిలం అనిల్ కుమార్ రెండు రోజుల క్రితం పొంగులేటితో భేటీ అయ్యారు. ఇలా, ఆయా జిల్లాల్లోని నేత‌లు కొంద‌రు ర‌హ‌స్యంగా హైద‌రాబాద్ లో స‌మావేశం అయ్యార‌ని స‌మాచారం. కొత్త పార్టీ పెడితే ఆయా జిల్లాల్లోని లీడ‌ర్లు ఎవ‌రు వ‌స్తారు? అనే దానిపై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట పొంగులేటి.

ప్ర‌ధానంగా రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను కాంగ్రెస్ పార్టీకి వెళ్ల‌కుండా (Telangana)

ఇదంతా బీజేపీ ఆడిస్తోన్న గేమ్ గా బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్ప‌టికే వైఎస్సార్ తెలంగాణ(Telangana) పార్టీ మీద బీజేపీ నీడ ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడుగా టీఆర్ఎస్ పార్టీని కొత్త రూపంలో తీసుకురావ‌డానికి ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానంగా రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను కాంగ్రెస్ పార్టీకి వెళ్ల‌కుండా చూడ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అతి పెద్ద సామాజిక‌వ‌ర్గంగా ఉన్న బీసీలు బీజేపీ వైపు మొగ్గార‌ని ఆ పార్టీ అంచ‌నా. ఇక రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను సానుకూలంగా మ‌లుచుకుంటే, రాజ్యాధికారం ఖాయ‌మ‌ని క‌మ‌ల‌నాథులు లెక్కులు వేసుకుంటున్నార‌ట‌.

Also Read : Operation NTR Statue : BRS కు జూనియ‌ర్ క్రేజ్! రేవంత్, T-TDPకి బ్రేక్!

ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల ఎత్తుగ‌డ‌లను గ‌మ‌నించిన కేసీఆర్ ఈసారి ఎస్సీల‌ను పూర్తి స్థాయిలో సానుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హిందూ ఓట్ల ఏకీక‌ర‌ణ కాకుండా ఉండేందుకు ఇప్ప‌టి నుంచే క‌విత‌, కేటీఆర్ జై భ‌జ‌రంగ‌బ‌లీ అంటూ నిన‌దిస్తున్నారు. కానీ, రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను భారీగా చీల్చుకోగ‌లిగితే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌ను (Telangana) బ‌ల‌హీన‌ప‌ర‌చొచ్చ‌ని బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని తెలుస్తోంది. అందుకే, ఒక వైపు ష‌ర్మిల మ‌రో వైపు పొంగులేటి పార్టీల ద్వారా బీజేపీ ఆ ప్ర‌యోగం చేస్తుంద‌ని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తున్నాయి. ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా `రెడ్డి` ల‌కు రాజ్యాధికారం కావాల‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకు ఎక్కువ‌. ఎస్సీల‌ను బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆక‌ర్షించ‌గ‌లిగితే, కాంగ్రెస్ పార్టీకి భారీ న‌ష్టం వాటిల్లుతుంది. ఈసారి బీసీలు మాత్రం బీజేపీ ఓటు బ్యాంకుగా క్షేత్ర‌స్థాయి స‌ర్వేల సారాంశం.

Also Read : Ponguleti Srinivas Reddy: ఖమ్మం వేదికగా బీజేపీ రాజకీయం

ద‌ళిత ఓటు బ్యాంకు కోసం బీఎస్పీ త‌ర‌పున ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీఆర్ ఎస్ కూడా ద‌ళిత బంధు ద్వారా భారీగా ఎస్సీ ఓట్ల‌ను దండుకోవాల‌ని చూస్తోంది. ఎంఐఎం స‌హ‌జ స్నేహం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు ను బీఆర్ఎస్ న‌మ్ముకుంది. కానీ, ఈసారి ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మ‌ళ్లే ఛాన్స్ ఉంది. ఇలా ప‌లు ర‌కాలుగా తెలంగాణ ఎన్నిక‌ల క్షేత్రాన్ని సామాజిక‌వ‌ర్గాలతో ఏర్ప‌డే గిజిగాడి గూడులా మార్చేయ‌డానికి బీజేపీ ఊహ‌కు అంద‌ని విధంగా స్కెచ్ వేస్తోంది. ఆ క్ర‌మంలో పొంగులేటి కొత్త పార్టీ (Telangana) రూపం దాల్చుకుంటోంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.