Telangana Poll 2023 : తొలి ఫలితం ఎక్కడి నుంచో తెలుసా ?

Telangana Poll 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం ప్రతిసారి భద్రాచలం నుంచే రిలీజ్ అవుతుంటుంది.

  • Written By:
  • Updated On - December 3, 2023 / 06:53 AM IST

Telangana Poll 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం ప్రతిసారి భద్రాచలం నుంచే రిలీజ్ అవుతుంటుంది. తక్కువ రౌండ్ల కౌంటింగ్ ఉండటంతో అక్కడి నుంచి ఫలితం త్వరగా వస్తుంటుంది. ఈసారి కూడా ఆ సెగ్మెంట్‌కు సంబంధించిన ఫలితం మధ్యాహ్నం 12 గంటలకల్లా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. అశ్వారావుపేట లో14 రౌండ్లు, పినపాకలో 18 రౌండ్లు, ఇల్లందులో 18 రౌండ్లు, కొత్తగూడెంలో19 రౌండ్లు ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి రౌండ్ కౌంటింగ్‌కు దాదాపు 20 నిమిషాల టైం పడుతుంది. 12 గంటలకల్లా తొలి ఫలితం భద్రాచలం నుంచి రిలీజ్ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక కౌంటింగ్ రౌండ్లు ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా 16 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 7 గంటల పాటు 23 రౌండ్స్ కౌంటింగ్ ఖమ్మం సెగ్మెంట్‌లో జరుగుతుంది. మంత్రి పువ్వాడ(బీఆర్ఎస్)పై, మాజీ మంత్రి తుమ్మల(కాంగ్రెస్) పోటీలో ఉండటంతో ఈ స్థానంలో టఫ్ ఫైట్ జరుగుతోంది.  ఖమ్మం సెగ్మెంట్లో 355 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. మొత్తం 3.22 లక్షల మంది ఓటర్లలో 2.30 లక్షల మంది ఓటు వేశారు. 71 శాతం పోలింగ్ నమోదైంది.  ఖమ్మం సెగ్మెంట్‌లో 5,600 పోస్టల్ బ్యాలెట్స్  ఉన్నాయి.

Also Read: Telangana Assembly Results: నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఇవాళ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటల నుంచి ఈవీఎంలను చెక్ చేసిన తర్వాతే రిజల్ట్ బటన్ నొక్కుతారు. ప్రతి రౌండ్‌లో ఆర్వో , మైక్రో అబ్జర్వర్ సంతకం చేసిన తర్వాత.. ఫలితం వివరాలను ట్యాబ్లేషన్ చేశాకే రిజల్ట్ బయటికి వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం సెగ్మెంట్ తర్వాత అత్యధిక రౌండ్లు పాలేరు సెగ్మెంట్‌లో ఉన్నాయి. పాలేరు సెగ్మెంట్ ఫలితంపైనా అంతటా ఉత్కంఠ నెలకొంది. అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Telangana Poll 2023) బరిలో ఉన్నారు.