Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ మరో ముండగేసింది. 13వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పగించారు , ప్రభుత్వం “ చలో మేడిగడ్డ” కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, అదే రోజు నల్గొండలో బీఆర్ఎస్ కృష్ణా నది పరీవాహక ప్రాజెక్టు అప్పగింతకు వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహించనుంది

తెలంగాణ రాష్ట్రంలో చలో మేడిగడ్డ వర్సెస్ చలో నల్గొండ కార్యక్రమాలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన ఉదయం 10.30 గంటలకు 119 ఎమ్మెల్యేలు, 40మంది శాసన మండలి సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం తీసుకెళ్తుందని అన్నారు. కేసీఆర్ కూడా 12న అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చలో పాల్గొనాలని, 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

కేఆర్‌ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో చలో నల్లగొండ బహిరంగ సభ ప్లాన్ చేస్తుంది. ఈ సభలో వారి ఆరోపణలపై పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. మొత్తానికి తెలంగాణాలో చలో మేడిగడ్డ – చలో నల్గొండ కార్యక్రమాలు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి.

Also Read: PM Modi: ఎన్నికల వేళ మోడీ ఎత్తుగడలు, అయోమయంలో కాంగ్రెస్