Site icon HashtagU Telugu

BJP VS BRS: రచ్చకెక్కిన రాజకీయం, బీజేపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి!

Kukatpally

Kukatpally

ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నేతలు మాటలు ఇప్పటి వరకు కోటలు దాటగా, ప్రస్తుతం కొట్టుకునే స్థాయికి వెళ్లింది. బీఆర్‌ఎస్‌ కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ భౌతికంగా దాడి చేయడంతో టీవీ లైవ్‌ చర్చ దుమారం రేపింది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తుతూ ఓ టీవీ ఛానెల్‌ సురారం రామ్‌లీలా మైదానంలో బహిరంగ చర్చ నిర్వహించింది.

ఈ లైవ్‌ వేదికలో ఇద్దరు రాజకీయ నాయకులు భూకబ్జాల ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు.  ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. వివేకానంద్‌ తండ్రి భూకబ్జాదారుడని శ్రీశైలం ఆరోపించగా, వివేకానంద్‌ శ్రీశైలం గౌడ్‌పైకి దూసుకెళ్లి అతని పై దాడి చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులో ఉంది.

ఇరు రాజకీయ పార్టీల సభ్యులు వేదికపైకి దూసుకు రావడం, బారికేడ్లను ధ్వంసం చేయడం, కుర్చీలు విసరడం, నినాదాలు చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, లేకుంటే కోర్టును ఆశ్రయిస్తాం అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి అన్నారు. కాగా ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బీజేపీ అభ్యర్థి ఇవాళ పోలీస్ స్టేషన్ లో వివేకానందపై ఫిర్యాదు చేశాడు.

Also Read: KTR: రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా: మంత్రి కేటీఆర్

Exit mobile version