TS constable Exam Postponed: కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా

కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 28కి వాయిదా పడింది.

Published By: HashtagU Telugu Desk
Ap Police

Ap Police

కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 28కి వాయిదా పడింది. ఆగస్టు 21న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా తేదీని మార్చినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలియజేసింది. రాష్ట్రంలో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్ పోస్టులకు 9.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ సహా 40 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  Last Updated: 09 Aug 2022, 02:48 PM IST