Chandrababu : చంద్రబాబు ఫై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

చంద్రబాబు ర్యాలీపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచేలా చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించారని బేగంపేట పోలీసులు ఆరోపించారు

Published By: HashtagU Telugu Desk
Ts Police Case File On Cbn

Ts Police Case File On Cbn

మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ఫై ఇప్పటికే ఏపీలో పలు కేసులు నమోదు కాగా…ఇప్పుడు తెలంగాణ లో కూడా కేసు నమోదైంది. స్కిల్ డెవలప్ కేసులో మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు (Chandrababu)..నిన్న హైదరాబాద్ (Hyderabad) కు చేరుకున్న సంగతి తెలిసిందే. 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు మంగళవారం విడుదలయ్యారు. రాజమండ్రి నుండి విజయవాడ వరకు దారి పొడువునా చంద్రబాబు టీడీపీ శ్రేణులతో పాటు జనసేన శ్రేణులు , అభిమానులు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు.

We’re now on WhatsApp. Click to Join.

బుధువారం సాయంత్రం, చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేటలో దిగిన ఆయనకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. ఇప్పుడు ఇదే ఆయన్ను పోలీస్ కేసు పెట్టెల చేసింది. చంద్రబాబు ర్యాలీపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచేలా చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించారని బేగంపేట పోలీసులు ఆరోపించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించడం నిబంధనలను అతిక్రమించడమేనని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21 రెడ్‌ విత్‌ 76 సీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్‌ చేసి ప్రజలను ఇబ్బందులను గురిచేశారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరలసెక్రెటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు.

Read Also : KTR: టాలెంట్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్

  Last Updated: 02 Nov 2023, 01:32 PM IST