Site icon HashtagU Telugu

KTR: తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ: మంత్రి కేటీఆర్

Protests Of IT Employees

KTR Meeting with Khammam Bhadradri Leaders in Telangana Bhavan Interesting comments on Congress

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో విపక్ష పార్టీలకు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పై కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు. కాళేశ్వరం అవినీతి అని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారని, బ్రిడ్జి కూలిపోతుంది అని ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

‘‘ఎక్ష్పాన్షన్ జాయింట్ (expansion joint) ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుంది అంటూ ఫోటోలు పెడుతున్నారు. ఇది వీళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. జనాన్ని ఆగం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ లోని  కొందరు చిల్లర గాళ్ళు. రాష్ట్రానికి వరం కాళేశ్వరం, దేశానికి శనిశ్వరం కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కి చరిత్ర తెల్వదు, తెలుసుకునే సోయి లేదు. స్క్రిప్ట్ అన్న  మార్చుకో,లేదా స్క్రిప్ట్ రైటర్ నన్న మార్చుకో రాహుల్ కి సూచన. కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం ధన యజ్ఞం చేసింది. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ గాడు మీ రేవంత్ రెడ్డి’’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

‘‘దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడు.. బ్లాక్ మెయిలర్, నోటు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్ల గొడ్లను అమ్మినట్టు అమ్ముకున్న రేవంత్ అలియాస్ రేటెంత రెడ్డి ని పక్కన పెట్టుకుని మాట్లాడడం దేశంలో అతిపెద్ద వింత. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని దేశంలో ఎవ్వరిని అడిగిన చెప్తారు.. ఆదర్శ్, బోఫోర్స్, కామన్ వెల్త్, స్పరెక్త్రం, బొగ్గు ఇలా చెప్పుకుంటూ  పోతే దేశంలో సహజ వనరులన్నీ దోచుకున్న దొంగలు మీరు. పంచ భూతాలను.. ఆకాశాన్ని, పాతాలన్ని మింగిన అవినీతి తిమింగాలాలు మీరు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధాన మంత్రులు మీ పార్టీ వాళ్ళు అవినీతి ఆరోపణలతో జైల్లో ఊచలు లెక్కబెట్టారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.