Site icon HashtagU Telugu

Telangana – 740 Jobs : పంచాయతీరాజ్‌ లో 740 జాబ్స్.. పోస్టుల వివరాలివే

Telangana  740 Jobs

Telangana  740 Jobs

Telangana  – 740 Jobs : తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని రాష్ట్ర  ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేసింది. దీనివల్ల పంచాయతీ రాజ్ విభాగంలో 740 కొత్త పోస్టులు ఏర్పడ్డాయి. వాటిని త్వరలోనే భర్తీ చేయనున్నారు. త్వరలో జరగబోయే రిక్రూట్మెంట్ లో 314 ఏఈఈ/ఏఈ పోస్టులను, 123 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను, 72 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను, 60 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను, 34 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను, 30 సూపరింటెండెంట్ పోస్టులను, 30 సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు 28 అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను, 23 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను, 13  సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులను, 7 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను, 4 చీఫ్ ఇంజనీర్ పోస్టులను, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు 2 భర్తీ చేయనున్నారు.

Also read : Today Horoscope : సెప్టెంబరు 11 సోమవారం రాశిఫలాలు.. వారు లావాదేవీల్లో జాగ్రత్త పడ్డాలి

వాస్తవానికి పంచాయతీ రాజ్ శాఖలో మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ జులైలోనే ఆమోదం తెలిపింది.  ఈ రిక్రూట్మెంట్ వల్ల ఇప్పటికే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఎంతోమంది ఉద్యోగులకు ప్రమోషన్స్  కూడా వచ్చాయి. ఇక రూరల్ డెవలప్ మెంట్ , పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాల్లో కొత్తగా 87 కార్యాలయాలను రెండు మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.  కొత్తగా 4 ఛీప్ ఇంజనీర్, 4 క్వాలిటీ కంట్రోల్ బోర్డు ఇంజనీరింగ్ కార్యాలయాలతో పాటు 12 కొత్త సర్కిళ్లు, 11 డివిజన్లు, ఆరు సబ్ డివిజన్ కార్యాలయాలను ప్రారంభిస్తామని (Telangana – 740 Jobs) తెలిపారు. త్వరలో ఆధునిక హంగులతో ఉప్పల్ లో పంచాయతీ రాజ్ భవన్ ను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.