Site icon HashtagU Telugu

Telangana Panchayat Elections : సంక్రాంతిలోపు సర్పంచ్ ఎన్నికలు – మంత్రి పొంగులేటి

Telangana Panchayat Electio

Telangana Panchayat Electio

తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలు (Telangana Panchayat Elections) ఎప్పుడు జరుగుతాయా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్పంచ్ ల పదవి కాలం పూర్తి అయ్యి నెలలు కావొస్తున్నా ఇంకా పంచాయతీ ఎన్నికలఫై క్లారిటీ లేదని మొన్నటివరకు అంత మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మంత్రి పొంగులేటి (Minister Ponguleti Srinivas Reddy) సర్పంచ్ ఎన్నికల ఫై ఓ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతిలోపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే రాబోయే నాలుగేళ్లు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని, సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని పేర్కొన్నారు.

ఇక పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే..

తెలంగాణ గ్రామీణాభివృద్ధి, తాగునీరు, రోడ్లు, విద్యుత్, పర్యావరణ సంరక్షణ, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో పంచాయతీ ఎన్నికలు చాలా ప్రాముఖ్యత కలిగివుంటాయి. గ్రామ సర్పంచ్‌లు ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రధాన పాత్ర పోషిస్తారు. తెలంగాణలో చివరిసారిగా 2019 లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, రాష్ట్రంలో పంచాయతీల్లో రాజకీయ చైతన్యం పెంచుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నేరుగా పాలనా బాధ్యతలు ఇవ్వడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి.

Read Also : Obesity : ఊబకాయం ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.. పరిశోధన ద్వారా వెల్లడైంది..!