Site icon HashtagU Telugu

వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కీలక ప్రకటన

వరిధాన్యంపై తప్పు మీదంటే మీదని బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర మాటల యుద్ధం కొనసాగిస్తున్న వేళ ధాన్యం కొనుగోలు పై వచ్చిన కేంద్రం ఒక ప్రకటన చేసింది.

వరిధాన్యంపై కేంద్రంపై టీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలతో పాటు, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తోన్న వార్తలను కేంద్రప్రభుత్వం ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వరిధాన్యం విషయంలో కేంద్రం తప్పుచేస్తోందని
కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం తెలిపింది.

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ మేరకు కొంటూనే ఉంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంఎస్పీ ధరకే ప్రతిగింజా కొనుగోలు చేస్తామని, టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై అబద్దాలు ప్రచారం చేస్తోందని విమర్శించింది.

Exit mobile version