Site icon HashtagU Telugu

TS Govt Schools: ప్రైవేట్ వద్దు.. గవర్నమెంట్ ముద్దు!

Govt Schools

Govt Schools

ఒకప్పుడు గవర్నమెంట్ బడి అంటేనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వెనకడుగు వేసేవారు. ముఖ్యంగా టీచింగ్, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలను సాకుగా చూపి గవర్నమెంట్ చదువుకు దూరమయ్యేవాళ్లు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వాలు గర్నమెంట్ స్కూళ్లకు మెరుగులు దిద్దడంతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ప్రైవేట్ పాఠశాలల నుంచి II నుండి X గ్రేడ్ వరకు 65,830 మంది విద్యార్థులు బదిలీ అయ్యారు. 2022-23 సంవత్సరానికి గాను సెప్టెంబర్ 1 నాటికి 60 వేల మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వానికి బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లో 10,278 మంది విద్యార్థులు ప్రయివేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ అయ్యారు.

రాష్ట్రంలో అత్యధికంగా బదిలీలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 8,503, మేడ్చల్ జిల్లాలో 7930 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ అయ్యారు. మొత్తంగా, రాష్ట్రవ్యాప్తంగా 2371 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల్లో 2,07,474 అడ్మిషన్లు జరిగాయి. విద్యార్థులు ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అని తెలుస్తోంది. ఈ విద్యాసంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో I నుండి VIII తరగతుల వరకు ఇంగ్లీష్ టీచింగ్ చేస్తుండటంతో విద్యార్థులు ఆసక్తిగా చూపుతున్నారు.