Site icon HashtagU Telugu

Telangana On Alert: కరోనా కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: సూపర్ స్ట్రెయిన్‌గా మారుతున్న ఓమిక్రాన్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వేరియంట్ ప్రభావంపై చర్చించేందుకు ఆదివారం వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమావేశం జరగనుంది.

కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొత్త వేరియంట్ విస్తరిస్తున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొత్త వేరియంట్‌పై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించారు.

కొత్త వేరియంట్ ప్రబలంగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఈ సందర్భంలో, తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కొత్త వేరియంట్ బాధితులను గుర్తించడం మరియు పరీక్షించడంపై వివిధ మార్గదర్శకాలను జారీ చేస్తుంది. దీనిపై రేపు కొత్త ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

Exit mobile version