Petrol Attack: రెవెన్యూ అధికారులపై ‘పెట్రోల్’ దాడి!

రెవెన్యూ అధికారులపై పెట్రోల్ దాడులు చేయడం సహజంగా మారింది.

  • Written By:
  • Updated On - May 11, 2022 / 04:02 PM IST

రెవెన్యూ అధికారులపై పెట్రోల్ దాడులు చేయడం సహజంగా మారింది. భూ సర్వేలు, రికార్డుల నమోదులో ఏమైనా ఇబ్బందులు ఉంటే.. అవన్నీ పరిష్కరించని పక్షంలో రెవెన్యూ సిబ్బందిపై సంబంధిత వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వివాదాన్ని పరిష్కరించేందుకు భూమిని సర్వే చేస్తుండగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసి దాడి చేయడంతో ఓ అధికారి గాయపడ్డాడు. జిల్లాలోని బీర్‌పూర్ మండలం తుంగూరులో గంగాధర్ ఇంటి ముందున్న సాధారణ రహదారిని ఆక్రమించాడనే ఫిర్యాదుల నేపథ్యంలో కొంత మంది అధికారులు భూమిని పరిశీలించేందుకు వెళ్లిన ఘటనలో  చోటుచేసుకుంది. వివాదాన్ని పరిష్కరించేందుకు తహసీల్దార్‌, మండల పరిషత్‌ అధికారి (ఎంపీఓ), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు.

అధికారుల రాకపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగాధర్‌ అధికారులపై స్ప్రేయింగ్‌ మిషన్‌లోని పెట్రోల్‌ చల్లాడు. పోలీసు అధికారి గంగాధర్‌ను ఆపడానికి ప్రయత్నించారు, అయితే ఈలోగా ఎంపీఓ రామకృష్ణరాజు మంటలు అంటుకోవడంతో మరికొందరు భద్రత కోసం పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న ఎంపీఓ కూడా పరుగుపెట్టాడు. మంటలను ఆర్పేందుకు కొందరు అధికారులు అధికారిపై నీళ్లు పోశారు. ఆయనను జగిత్యాల ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు గంగాధర్‌ని అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ అధికారులపై పెట్రోల్ దాడి చేసిన ద్రుశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.