Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ నెంబర్ వన్ : సీఎం రేవంత్

Telangana number one in job creation: CM Revanth

Telangana number one in job creation: CM Revanth

CM Revanth Reddy : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్,బయోటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులను చూసి హైదరాబాద్ ఈజ్ అన్‌స్టాపబుల్ అంటున్నారని వివరించారు. ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిలోనే దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నంబర్‌వన్‌గా నిలిచామని చెప్పారు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానన్నారు.

Read Also: Posani Krishna Murali : పోసానిపై కీలక వ్యాఖ్యలు చేసిన జోగిమణి

దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రెండుసార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తరువాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు.. కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని నేను చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరన్నారు.

గ్లోబల్ కంపెనీగా హెచ్‌సీఎల్‌ టెక్‌ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇది 2.2 లక్షల మందికిపైగా ఉద్యోగులతో 60 దేశాల్లో ఆపరేట్‌ చేస్తోంది. డిజిటల్‌, ఇంజినీరింగ్‌, క్లౌడ్‌, ఏఐ రంగాల్లో వరల్డ్‌ క్లాస్‌ ఆఫరింగ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 2007లో హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి హెచ్‌సీఎల్‌ అంచలంచెలుగా పెద్ద స్థాయికి ఎదిగింది అని రేవంత్‌రెడ్డి అన్నారు. నేను మొదట తెలంగాణ, హైదరాబాద్‌ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరికి కచ్చితంగా తెలియదు.. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్‌ను ఇటీవలే ప్రారంభించాం. ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఆసియా సదస్సును నిర్వహించామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Read Also: Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం