Site icon HashtagU Telugu

Telangana Whips : తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలు

Telangana Budget

Revanth Reddy wants to Changes in Telangana Assembly

రేవంత్ సర్కార్ (Telangana Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్ (Telangana Whips) లుగా నలుగురు ఎమ్మెల్యేలను (4 MlAS) ఖరారు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వంలో పలుశాఖల్లో పనిచేసిన వారందర్ని మార్చేస్తూ వస్తుంది. ఇప్పటీకే అనేక శాఖల్లో కీలక మార్పులు చేసిన సీఎం రేవంత్…తాజాగా ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలను నియమించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అడ్డూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్‌లను ఎంపిక చేసింది. ఈ నలుగురు తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించినవారే. సామాజికవర్గాలుగా చూసి ఈ నలుగురు ఎమ్మెల్యేలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గరి నుండి కూడా కాంగ్రెస్ అధిష్టానం..సీఎం రేవంత్ అన్ని ప్రధాన సామాజికవర్గాలను కవర్ చేసేలా నియామకాలను చేస్తూ వస్తున్నారు. ఈ నలుగురిని ప్రస్తుతం విప్ లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొన్ని కీలక పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనుంది.

Read Also : Governor Tamilisai Speech : ఇది ప్రజా ప్రభుత్వం.. నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు