New Secretariat: ఏప్రిల్ 30న తెలంగాణ సచివాలయం ప్రారంభం

తెలంగాణ నూతన సచివాలయ (New Secretariat) ప్రారంభోత్సవానికి సమయం ఖరారైంది. శుక్రవారం సచివాలయ పనులను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ మేరకు తేదీని వెల్లడించారు.

  • Written By:
  • Updated On - March 10, 2023 / 01:32 PM IST

తెలంగాణ నూతన సచివాలయ (New Secretariat) ప్రారంభోత్సవానికి సమయం ఖరారైంది. శుక్రవారం సచివాలయ పనులను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ మేరకు తేదీని వెల్లడించారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: 36 Students Hospitalised: ఫుడ్ పాయిజన్ తో 36 మంది విద్యార్థినులకు అస్వస్థత

సచివాలయ పనులు దాదాపు తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సచివాలయ పనులను పర్యవేక్షించడంతో పాటు అక్కడి రోడ్లను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.దీనితో పాటు అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవానికి తేదీలను ఖరారు చేశారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, జూన్ 2న అమరవీరుల స్థూపం ప్రారంభించనున్నారు.

తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు 2019 జూన్ 27న కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్త సచివాలయం పార్కింగ్ స్థలంలో 300 కార్లు, 600 ద్విచక్రవాహనాలు పార్క్ చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, రెండు, మూడో అంతస్థుల్లో కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు ఉంటాయి. ఏడో అంతస్థులో సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది.