Telangana Cabinet : తెలంగాణ కొత్త మంత్రులు వీరేనా..?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్

Published By: HashtagU Telugu Desk
New Ministers

New Ministers

జులై 04 న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet) జరగబోతున్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం తో పాటు మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న 06 స్థానాలకు భర్తీ చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధం అయ్యింది. ఈ నెల 4న మంత్రివర్గణ విస్తరణ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కేవలం 4 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ (Gandhi Bhavan) వర్గాలు అంటున్నాయి. మరో 2 ఖాళీలను ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందట. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. వీరిని పలు శాఖలకు మంత్రులుగా ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. మంచిర్యాల నుంచి గెలిచిన ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ మంత్రి వర్గంలో చోటు కోసం ట్రై చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఢిల్లీ (Delhi) కి వెళ్లనున్నట్లు సమాచారం.

Read Also : TGSRTC : 3,035 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  Last Updated: 02 Jul 2024, 03:10 PM IST