తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం (Telangana New Cabinet)కొలువుదీరనుంది. గత కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొని ఉండగా, చివరకు కొత్త మంత్రుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం, వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy), సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy), రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy), శ్రీహరి (Vakiti Srihari) నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి నియామకం ద్వారా ప్రభుత్వం పరిపాలనలో మరింత సమతుల్యత తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Hyderabad: ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు
కొత్తగా మంత్రులుగా నియమితులైన వారి శాఖలు ఖరారైనట్లు ఢిల్లీ సమాచారం. వివేక్ వెంకటస్వామికి మున్సిపల్ (Vivek – Municipal) శాఖ, సుదర్శన్ రెడ్డికి విద్యాశాఖ (Sudarshan – Education), రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ (Rajgopal-Home), శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖ(Srihari -BC Welfare)లను కేటాయించారు. మంత్రివర్గంలో నూతన మంత్రులతో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రత్యేకంగా మున్సిపల్ పరిపాలన, విద్యా రంగంలో సంస్కరణలు, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిరక్షణ, బీసీ సంక్షేమ కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టే విధంగా ఈ కేటాయింపులు జరిగాయి.
Tirupati : తిరుపతిలో ట్రాన్స్ ఫర్మేటివ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన DBRC,టెట్రా ప్యాక్
ఇదిలా ఉండగా ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ లను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం అవుతుంది. వారు ఇప్పటివరకు నిర్వహిస్తున్న శాఖలే తిరిగి వారి చేతిలోనే కొనసాగనున్నాయి. దీనివల్ల ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన నేతలకు కొనసాగింపు లభించనుండగా, కొత్తగా వచ్చిన మంత్రులు పరిపాలనా వ్యవస్థలో మిశ్రమ సమతుల్యతను అందించనున్నారు.
కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్న నేతల రాబోయే రాజకీయ ప్రస్థానం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండబోతుంది. వివేక్ వెంకటస్వామి రాజకీయ కుటుంబంలో పుట్టి, బలమైన సామాజిక మద్దతుతో ముందుకు సాగారు. సుదర్శన్ రెడ్డి విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా తన రాజకీయ జీవితం కొనసాగించారు. రాజగోపాల్ రెడ్డి, హోంషాఖ బాధ్యతలు స్వీకరించనున్నందున, రాష్ట్రంలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పటిష్ఠతకు కృషి చేయనున్నారు. శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖకు అనుగుణంగా అనేక ప్రజాసేవా కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఈ కొత్త మంత్రివర్గం ద్వారా రాష్ట్రాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.