New Convoy Vehicles For Telangana CM : తెలంగాణ కొత్త సీఎం కాన్వాయ్ సిద్ధం..తగ్గేదేలే

వైట్ కలర్ వాహనాలను జీఏడీ తీసుకు వచ్చింది. రెండు కొత్త కార్లు కాగా 4 ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయిన కార్లు ఉన్నాయి

Published By: HashtagU Telugu Desk
Telangana New Cm Convoy Rea

Telangana New Cm Convoy Rea

తెలంగాణ (Telangana) లో కొత్త ప్రభుత్వం (New government of Telangana) ఏర్పాటు కాబోతుంది. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) ప్రభుత్వ పాలన చూసిన రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ కి ఛాన్స్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. ఏకంగా 64 స్థానాల్లో గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు పూర్తి మద్దతు ఇచ్చారు. రేపు తెలంగాణ సీఎం ఎవరనేది తెలియనుంది. ఇదే క్రమంలో కొత్త సీఎం కాన్వాయ్ సిద్ధం చేసారు రాష్ట్ర పోలీస్ శాఖ.

ఆరు కొత్త వాహనాలను (New Convoy Vehicles) తెలంగాణ జీఏడీ తీసుకు వచ్చింది. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కొత్త కాన్వాయ్ లో సీఎంగా వెళ్లేందుకు వీలుగా వాహనాలను సిద్దం చేశారు. వైట్ కలర్ వాహనాలను జీఏడీ తీసుకు వచ్చింది. రెండు కొత్త కార్లు కాగా 4 ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయిన కార్లు ఉన్నాయి. అయితే బాధ్యతలు చేపట్టిన కొత్త సీఎం.. తన అభీష్టం మేరకు కాన్వాయ్‌ను మార్చుకునే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రద్దు చేశారు. కొత్త ప్రభుత్వానికి సంబంధించి సాంకేతికపరమైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

  Last Updated: 04 Dec 2023, 07:38 PM IST