Telangana CM : తెలంగాణ కొత్త సీఎం ప్రకటన ఈరోజు లేనట్లే..

సాయంత్రం కల్లా సీఎం ను ప్రకటిస్తారని అంత భావించారు కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ఈరోజు సీఎం ప్రకటన లేనట్లే కనిపిస్తుంది

Published By: HashtagU Telugu Desk
Tcngcm

Tcngcm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election Results) ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..సీఎం ఎవర్ని ప్రకటిస్తారో అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టింది. నిన్నటి నుండి యావత్ కాంగ్రెస్ శ్రేణులే కాదు ఇతర పార్టీ నేతలు సైతం కాంగ్రెస్ అధిష్టానం ఎవర్ని సీఎం గా ప్రకటిస్తుందో అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సోమవారం హైదరాబాద్ (Hyderabad) లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఎన్నికల్లో గెలిచినా పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం చేసినట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు. సాయంత్రం కల్లా సీఎం ను ప్రకటిస్తారని అంత భావించారు కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ఈరోజు సీఎం ప్రకటన లేనట్లే కనిపిస్తుంది. సీఎం అభ్యర్థిపై సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ..కొలిక్కి రాలేదు. దీంతో అధిష్టానం DK శివకుమార్ తో పాటు నలుగురు పరిశీలకులను ఢిల్లీకి పిలిచింది. రేపు ఖర్గే తో ఏఐసీసీ పరిశీలకులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం తరువాత రేపు సీఎం ఎవరనేది ప్రకటిస్తారు కావొచ్చు.

Read Also : Exit Poll Results: ఈ ఎన్నికల్లో ఖచ్చితమైన ప్రీ పోల్స్ రిజల్ట్స్ ఇచ్చాం : చాణక్య ముఖేష్

  Last Updated: 04 Dec 2023, 06:24 PM IST