Invalid Votes: అవగాహనా రాహిత్యం.. ఎమ్మెల్సీ పోల్స్‌లో భారీగా చెల్లని ఓట్లు

ఈ లెక్కన పోల్ అయిన వాటిలో దాదాపు 11 శాతం ఓట్లు చెల్లలేదు(Invalid Votes).

Published By: HashtagU Telugu Desk
Exit Polls

Exit Polls

Invalid Votes:  తెలంగాణలో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెలువడిన ఒక లెక్క అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చెల్లని ఓట్లు పెద్దసంఖ్యలో పోల్ అయ్యాయని పోలింగ్ అధికారులు వెల్లడించారు.  దీంతో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన వాళ్లు కనీసం ఎమ్మెల్సీ ఎన్నిక ఓటును కూడా వేయలేకపోయారా ? అనే ప్రశ్న ఉదయించింది. ఇంజినీరింగ్ చేసిన వాళ్లందరికీ జాబ్స్ రావడం లేదనేది ఎంత నిజమో. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారందరికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడంపై అవగాహన లేదనేది అంతే నిజమని తాజా గణాంకాలతో తేలిపోయింది.

Also Read :Driverless Vehicles: తెలంగాణ రోడ్లపై డ్రైవర్ రహిత వాహనాలు

కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ పట్టభద్రుల స్థానం

  • కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 3.55 లక్షల ఓట్లు ఉన్నాయి. అయితే పోల్ అయినవి మాత్రం 2,52,100 ఓట్లు మాత్రమే. దాదాపు 1.03 లక్షల మంది ఓట్లు వేయలేదు.
  • పోల్ అయిన ఓట్లలో 28వేల ఓట్లు చెల్లవు అని గుర్తించారు.
  • ఈ లెక్కన పోల్ అయిన వాటిలో దాదాపు 11 శాతం ఓట్లు చెల్లలేదు(Invalid Votes).

కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ టీచర్స్ స్థానం

  • కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 897 ఓట్లు చెల్లలేదు.

వరంగల్ – ఖమ్మం – నల్గొండ టీచర్స్ స్థానం

  • వరంగల్ – ఖమ్మం – నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 499 ఓట్లు చెల్లలేదు.

Also Read :Professor Kodandaram: ఎమ్మెల్సీ పోల్స్‌లో ఎమ్మెల్సీ కోదండరామ్‌‌కు షాక్

ఏపీలోనూ ఇదే సీన్..

  • ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చెల్లని ఓట్లు పెద్దసంఖ్యలోనే పోల్ అయ్యాయి.
  • ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 11.05 శాతం చెల్లని ఓట్లు పడ్డాయి.
  • ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్‌ పేపరులో ప్రతీ అభ్యర్థికి ఒక క్రమ సంఖ్య ఉంటుంది.  అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో ప్రాధాన్యతా  సంఖ్యను వేయాలి.  అయితే కొందరు ఆ గడిలో అంకె వేయకుండా, టిక్ పెట్టారు. దీంతో ఆ ఓటు చెల్లలేదు.
  • ఇంకొందరు ఆ గడిలో అంకె వేసి రౌండప్ చేయడంతో.. ఓటు చెల్లలేదు.
  • కొందరు గడిలో అంకె వేసి, దాని కింద అండర్ లైన్ చేశారు. దీంతో ఆ ఓటు చెల్లలేదు.
  • ఇంకొందరు ఓటు వేసిన భాగం వరకు చించి.. దాన్ని మిగిలిన బ్యాలెట్‌ పత్రం మధ్యలో పెట్టి బాక్సులో వేశారు. దీంతో అది కూడా చెల్లలేదు.
  • కొంతమంది ఓటు వేయాలనుకున్న అభ్యర్థి ఎదురుగా ఇంటూ మార్క్‌ పెట్టారు.
  Last Updated: 05 Mar 2025, 10:15 AM IST