MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్.. కండీషన్స్ అప్లయ్!

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Rajasingh

Rajasingh

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. ‘‘ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు. జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు నిర్వహించొద్దు. 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయొద్దు’’ అని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది.

సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్‌పై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అంతేకాకుండా మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని కూడా రాజా సింగ్ కు కోర్టు షరతులు విధించింది. తక్షణమే రాజా సింగ్ ను విడుదల చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

  Last Updated: 09 Nov 2022, 05:04 PM IST