Minor Raped: దారుణం.. మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!

బాలికల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. పోలీసులు అప్రమత్తంగా ఉన్నా..

  • Written By:
  • Updated On - April 20, 2022 / 10:12 PM IST

బాలికల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. పోలీసులు అప్రమత్తంగా ఉన్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా 13 ఏళ్ల బాలికను వివిధ వ్యభిచార కేంద్రాలకు పంపడంతో, 80కిపైగా ఆ బాలికను అత్యాచారం చేశారు. ఈ ఘటన  ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాలిక తండ్రి సమాచారం ప్రకారం.. ఎనిమిది నెలలకు పైగా వ్యభిచారం చేయిస్తున్న 13 ఏళ్ల బాలికను గుంటూరులో పోలీసులు మంగళవారం నాడు రక్షించారు. ఎనిమిది నెలల కాలంలో 80 మంది వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తేలింది.

ఈ క్రమంలో బి.టెక్ విద్యార్థితో సహా 10 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ నేరంలో పాల్గొన్న 80 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే మైనర్ బాలికను సవర్ణ కుమారి అనే మహిళ దత్తత తీసుకుంది. ఆమె గత సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆసుపత్రిలో బాలిక తల్లితో పరిచయం చేసుకుంది. ఆ తర్వాత కరోనా కారణంగా బాలిక తల్లి మరణించింది. దీంతో బాలికను సువర్ణ తీసుకెళ్లింది. అయితే 2021 ఆగస్టులో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా ప్రధాన నిందితురాలిగా సవర్ణ కుమారి అనే మహిళను పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో మొదటి అరెస్టు జనవరిలో జరగగా, మంగళవారం ఏప్రిల్ 19న, గుంటూరు వెస్ట్ జోన్ పోలీసులు బీటెక్ విద్యార్థితో సహా మరో 10 మందిని అరెస్టు చేశారు. నిందితులు, బాధితురాలిని విచారించిన తర్వాత పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. గత ఎనిమిది నెలలుగా 13 ఏళ్ల బాలికను ఏపీ, తెలంగాణలోని వేర్వేరు వ్యభిచార గృహాలకు పంపారు. బాలికను తీసుకెళ్లిన  కుమారి అనే మహిళ మైనర్‌ను వ్యభిచారంలోకి దింపినందుకుగానూ ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.