Site icon HashtagU Telugu

Botsa Satyanarayana : బొత్సకు కౌంటర్ ఇస్తున్న తెలంగాణ మంత్రులు.. ఏపీ VS తెలంగాణ విద్యాశాఖ

Telangana Ministers Sabitha Indrareddy and Gangula some others fires on AP Educational Minister Botsa Satyanarayana

Telangana Ministers Sabitha Indrareddy and Gangula some others fires on AP Educational Minister Botsa Satyanarayana

నేడు ఉదయం ఏపీ(AP) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Bothsa Satyanarayana) తెలంగాణ (Telangana) విద్యావ్యవస్థ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ(Vijayawada)లో నేడు ట్రిపుల్ ఐటీ(IIIT) ప్రవేశ ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్‌ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు.. రోజూ మనం చూస్తునే ఉన్నాంగా, ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది, మన ఆలోచనలు మనవి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారాయి. దీనిపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. అయన మీడియాతో మాట్లాడుతూ.. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారు. తెలంగాణ రాకముందు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ లోను మంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చాక కూడా విషం చిమ్ముతున్నారు. తెలంగాణ వచ్చాక విద్యావ్యవస్థ మెరుగుపడింది. నాడు మంత్రిగా ఉన్న ఆంధ్ర నాయకుల వైఫల్యం వల్ల ఎంతోమంది చదవలేకపోయారు. గతంలో 297 గురుకులాలు మాత్రమే తెలంగాణ ప్రాంతంలో ఉండేవి కానీ ఇప్పుడు తెలంగాణలో 1009 గురుకులాలు ఉన్నాయి. ఏపీలో మాత్రం ఇంకా 380 గురుకులాలే ఉన్నాయి. TSPSCలో తప్పు జరిగితే పట్టుకుంది ప్రభుత్వమే. కానీ ఏపీలో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారు. కనీసం ఒక్కరినైనా పట్టుకున్నారా బొత్స చెప్పాలి. బొత్స సత్యనారాయణ వీటన్నింటిపై స్పందించాలి. హైదరాబాద్ మీద మళ్ళీ ఆంధ్ర నాయకుల కన్ను పడిందా అంటూ సీరియస్ అయ్యారు మంత్రి గంగుల.

ఇక తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా బొత్సా కామెంట్స్ పై స్పందించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపి మంత్రి బొత్సవి అవగాహన లేని వ్యాఖ్యలు. బొత్స వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేలా ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకోవాలి. మా విద్యా వ్యవస్థను వేలెత్తి చూపెంత స్థాయి మీకు లేదు. రెండు రాష్ట్రాల విద్యా వ్యవస్థపై చర్చించేందుకు మీరు సిద్దమా..? విద్యా వ్యవస్థ లో మేము చేసింది ఏంటో.. మీరు ఉద్దరించింది ఏంటో చర్చిద్దమా? తెలంగాణలో తొమ్మిదేళ్ళలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారు. 2015, 2018లో ఇక్కడ టీచర్స్ బదిలీలు జరిగాయి. ముందు తెలుసుకుని మాట్లాడండి, తప్పుగా మాట్లాడొద్దు. మేము రెండు రాష్ట్రాల్లోని ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. కేసీఆర్ విజన్ తో తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందింది. ఐఐటీ, మెడికల్, ఇంజరింగ్ లో విద్యార్థులు సాధించిన ఫలితాలు మీకు కనబడటం లేదా? ఒక్కో గురుకులం విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి లక్ష 20 వేలు ఖర్చు చేస్తుంది. మీ రాష్ట్రంలో ఏంత ఖర్చు చేస్తున్నారో చెప్పండి..? ఏపిలో ప్రభుత్వ పాఠశాలలో లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో చెప్పాలి? మా దగ్గర రెండున్నర లక్షల మంది విద్యార్థులు పెరిగారు అని అన్నారు. మరింత మంది తెలంగాణ మంత్రులు బొత్సపై ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై బొత్స స్పందిస్తారేమో చూడాలి.

 

Also Read : Pawan Kalyan : వాలంటీర్ వ్యవస్ద అసలు అవసరం లేదు.. మళ్ళీ మళ్ళీ.. వాలంటీర్ల గురించే మాట్లాడుతున్న పవన్..