Site icon HashtagU Telugu

Telangana Ministers: ఢిల్లీలో తెలంగాణ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న కేంద్ర మంత్రులు

telangana leaders

telangana leaders

కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రులను కలవడానికి ప్రయత్నం చేయగా ఎవరూ కలవడం లేదని సమాచారం. ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని మంత్రుల బృందం డిమాండ్ చేస్తోంది. తాము ఢిల్లీలో తెలంగాణ రైతాంగం పక్షాన వేచి ఉన్నామని, గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రానికి 40 లక్షల బియ్యం, 60 లక్షల వరిధాన్యం సేకరణకు ఎంవోయూ కుదిరిందని దాన్ని పెంచాలని మంత్రుల బృందం డిమాండ్ చేస్తోంది.

రా రైస్ ఎంతైనా కొంటామని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పారని , నోటి మాట చెప్పడం వేరు లిఖిత పూర్వకంగా చెప్పడం వేరని తమకి లిఖితపూర్వక హామీ కావాలని, ఎంత తీసుకుంటారో రాతపూర్వకంగా చెప్పాలని మంత్రులు కోరుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6,952 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేసిన ఘనత తెలంగాణదని మంత్రులు తెలిపారు.

రైతుల కోసం, వారి ప్రయోజనాల కోసం తాము ఢిల్లీ వచ్చామని, కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో రాజకీయాలు చేస్తోందని మంత్రులు విమర్శించారు. ఐదు నిమిషాల అప్పాయింటుమెంట్ ఇవ్వడానికి కూడా మేము ఇష్టం ఉన్నప్పుడు ఇస్తాం. అప్పుడు రండి, ఇప్పుడు రండి అనే ధోరణిలో ఉన్నారని, ఇది సరైనది కాదని, రైతుల కోసం మేము ఓర్చుకుంటున్నామని మంత్రులు తెలిపారు. కేంద్ర మంత్రులు తెలంగాణ రైతాంగాన్ని అవమాన పరిచినట్లు ఉందని, రైతుల మొర వినాలని కోరుతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు.

Exit mobile version