Site icon HashtagU Telugu

Srinivas Goud PA : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కుమారుడు ఆత్మ‌హ‌త్య‌

Suicide

Suicide

అనుమాన‌స్ప‌ద స్థితిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ దేవేంద్ర కుమారుడు అక్ష‌య్‌కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం సివిల్స్ ప్రిపేర్ అవుతోన్న అక్ష‌య్ కుమార్ ఆత్మ‌హ‌త్య కొండాపూర్లోని ఇంట్లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సేవలు, పర్యాటక, సంస్కృతి, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ‌ద్ద దేవేంద్ర పీఏ గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న కుమారుడు అక్షయ్ కుమార్ తల్లిదండ్రులతో కలిసి కొండాపూర్ సెంటర్ పార్క్ కాలనీలోని శ్రీవెంకటసాయి నిలయంలో నివాసం ఉంటున్నాడు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అక్షయ్ కుమార్ సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు.

అక్షయ్ కుమార్ పై ఇటీవల పలు ఆరోపణలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం చేశాడని ఆరోపణలతో మనస్తాపానికి గురైన అక్షయ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథ‌మికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version