Chandrababu Case: తెలంగాణాలో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఉండవ్

చంద్రబాబు అరెస్టుని ఖండించే వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఈ ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పదుల సంఖ్యలో చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు

Chandrababu Case: చంద్రబాబు అరెస్టుని ఖండించే వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఈ ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పదుల సంఖ్యలో చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు. బాబు అరెస్టుపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు.

ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నప్పుడు వివిధ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజల శ్రేయస్సు, అవసరాల కోసం సౌకర్యాల కోసం, అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాటిని సాకుగా చూపి అరెస్టులు చేయడం సరికాదన్నారు పువ్వాడ అజయ్ కుమార్. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు మంచివి కావని పువ్వాడ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను అనుమతి లేకుండా అరెస్టు చేయడం సరికాదని తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చాలా బాధాకరం అన్నారు. ఈ తరహా కక్షపూరిత రాజకీయాలు తెలంగాణలో కూడా ఉండవని అన్నారు. సండ్ర వెంకటవీరయ్య చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన విషయాన్ని మంత్రి పువ్వాడ గుర్తు చేశారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కేసులో గత శుక్రవారం అర్ధరాత్రి నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటైంది. నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా నిరుద్యోగ యువత సాధికారిత అందించాడం దీని లక్ష్యం.

Also Read: Lokesh Delhi Tour : ఢిల్లీ బ‌య‌ల్దేరిన నారా లోకేష్‌.. ఏపీ పరిస్థితుల‌పై జాతీయ మీడియాకు ప్ర‌జెంటేష‌న్‌