Site icon HashtagU Telugu

TS Minister Malla Reddy: ఎవరనుకున్నారు…మల్లారెడ్డి ఇక్కడ..తగ్గేదేలే..!!

malla reddy

malla reddy

ఎవరనుకున్నారు అక్కడ మంత్రి మల్లారెడ్డి. మంత్రి మల్లన్న అంటే ఎలా ఉండాలి… తగ్గేదేలే అన్నట్లు ఉండాలి. మల్లారెడ్డికి తొడగొట్టడమే కాదు…సందర్భానికి తగ్గట్లు డ్రెస్సింగు వేయడం కూడా తెలుసు. ప్రపంచ కార్మికల దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మేడే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

ఈ సెలబ్రెషన్స్ లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు. కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినక సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి ఎంతలా పాటుపడ్డారో తెలిపారు. అయితే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆ శాఖ మంత్రి మల్లారెడ్డి కార్మికుడి గెటప్ లో రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తమలాగే తమ మంత్రి కూడా రెడీ అయ్యారని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కాకి డ్రెస్సు…మెడలో రెడ్ కలర్ టవల్ వేసుకుని అచ్చం కార్మికుని తయారయ్యారు మల్లారెడ్డి.