KTR: మోడీ ఇమేజ్ పై కేటీఆర్ ‘సోషల్’ యుద్ధం

తెలంగాణ మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాన మంత్రి మోడీని టార్గెట్ చేసాడు. ఆయనకు ఇమేజ్ ని తగ్గించేలా ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. టెలీప్రాంప్టర్ పీఎం అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో చేస్తున్న ప్రచారంపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు.

  • Written By:
  • Updated On - January 21, 2022 / 12:21 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాన మంత్రి మోడీని టార్గెట్ చేసాడు. ఆయనకు ఇమేజ్ ని తగ్గించేలా ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. టెలీప్రాంప్టర్ పీఎం అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో చేస్తున్న ప్రచారంపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు.
తాజాగా శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరి సేనకు మోడీ పలికిన స్వాగతంపై సెటైర్లు వేస్తూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సోషల్ యుద్ధం మొదలు పెట్టాడు. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనే సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల్ సిరిసేన.. మిస్సెస్ సిరిసేనను స్వాగతిస్తూ ప్రధాని పలికిన మాటలపై ఆయన స్పందించారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను ఉద్దేశించి ఆయన సెటైర్లు వదిలాడు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను.. ఎంఆర్ఎస్ సిరిసేన అని ప్రధాని వ్యాఖ్యానించడం హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన.. మిసెస్ సిరిసేన అని చెప్పాల్సింది పోయి.. ఎంఆర్ఎస్ సిరిసేన అనడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అదే విషయంపై స్పందించిన కేటీఆర్ విజనరీలందు టెలీవిజనరీలు వేరయా అంటూ ఘాటుగా సెటైర్లు వేశాడు. మోదీపై టీఆర్ఎస్ నేతలు టెలీప్రాంప్టర్ పీఎం అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో చేస్తున్న డామేజ్ కి ఇప్పుడు మళ్లీ కేటీఆర్ చేసిన ట్వీట్ హీట్ ఎక్కించింది. ట్విటర్‌లో మాత్రమే హైదరాబాద్‌ను నిర్మించిన సినిస్టర్స్ ఉన్నారంటూ కేటీఆర్‌పై బీజేపీ సెటైర్లు వేస్తుంది.

టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ని ట్వీట్‌లో కోట్ చేయడం ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చేసినట్లు ఫీలవుతున్న కేటీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా దీటుగానే కౌంటర్ ఇస్తున్నారు. గుమ్మడికాయ దొంగెవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. మొత్తం మీద మోడీ ఇమేజ్ ను డామేజ్ చేస్తున్న కేటీఆర్ ట్వీట్లు నెటీజన్లకు మంచి పనిపెట్టాయి. ఇక బీజేపీ సోషల్ మీడియా కూడా ఇప్పుడు వేగం పెంచింది. కేటీఆర్ వ్యవహారాన్ని ట్విట్టర్ కు ఎక్కిస్తుంది. మొత్తం మీద ట్విట్టర్ యుద్ధం చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ తెలంగాణ రైతులు, ఉద్యోగ బదలీ కి సంబందించిన 317 జీవోను పక్కదోవ పట్టించాయి. ఇదే విషయాన్ని నెట్ జన్లు లెవనెత్తుతున్నారు. సో.. మోడీని నేరుగా టార్గెట్ చేసిన కేటీఆర్ ను బీజేపీ ఏం చేస్తుందో ..చూద్దాం.