KTR meets Basara Students: బాసర ఐటీ విద్యార్థులతో భోజనం చేసిన కేటీఆర్!

తెలంగాణ మంత్రి కేటీఆర్ తొలిసారిగా సందర్శన బాసర ఐఐఐటీని సందర్శించారు.

  • Written By:
  • Updated On - September 26, 2022 / 05:11 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ తొలిసారిగా సందర్శన బాసర ఐఐఐటీని సందర్శించారు. ఫుడ్ పాయిజనింగ్ సంఘటనల కారణంగా వివాదంలో చిక్కుకున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, భోజనం, హాస్టల్ సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. అలాగే 12 డిమాండ్ల పరిష్కారంపై క్యాంపస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఆందోళన విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ ఇన్ స్టిట్యూట్ కు కేటీఆర్ రావడం ఇదే తొలిసారి. నాణ్యమైన ఆహారం, తాగునీరు అందించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తూ యూనివర్శిటీలో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి కెటి రామారావు, మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, వి శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్ర కిరణ్‌రెడ్డితో కలిసి ఐఐఐటి-బాసరను సందర్శించారు. రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్-బాసర, తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న విశ్వవిద్యాలయం. మెస్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మౌలిక వసతులు, భోజనం, హాస్టల్‌ సౌకర్యాలపై మంత్రి ఆరా తీయడంతో పాటు 12 డిమాండ్‌ల పరిష్కారంపై క్యాంపస్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్ చార్జి వీసీ వెంకటరమణ పలు అంశాలపై ఆయనకు వివరించినట్లు సమాచారం.

”ఈ యూనివర్సిటీలో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించే మినీ టీ-హబ్ ఉండాలి. విద్య, I-T శాఖ నిధులతో ఆ ప్రయత్నాలు ప్రారంభిస్తాం. కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపాం. కానీ గతంలో ఇచ్చిన ల్యాప్‌టాప్‌లు ఆపేశారు. మీకు ల్యాప్‌టాప్‌లను అందించడానికి నవంబర్‌లో ఎప్పుడైనా తిరిగి వస్తాము. క్రీడలకు సౌకర్యాలు లేవని కూడా తెలుసుకున్నాం. ఔట్ డోర్ క్రీడల కోసం ఏర్పాటు చేసే మినీ స్టేడియం కోసం రూ.3 కోట్లు అందజేస్తాం. 6-8 నెలల్లో పూర్తి చేయగలుగుతాం’’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.