KTR on Twitter: ఆదానీ, మోడీ స్కామ్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మీద సంచ‌ల‌న ట్వీట్ చేశారు.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 04:30 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మీద సంచ‌ల‌న ట్వీట్ చేశారు. శ్రీలంక కేంద్రంగా మోడీ, అదానీ `ప‌వ‌ర్` డీల్ పై ఆరోప‌ణ‌లు చేశారు. ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టు విష‌యంలో మోడీ జోక్యం చేసుకుని స‌హ‌కరించార‌ని కేటీఆర్ ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. శ్రీలంక‌లో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ ను ఎలాంటి పోటీ లేకుండానే అదానీ దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తీసుకొచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పని చేసిన ఎంఎంసీ ఫెర్డినాండో ఇటీవల వెల్లడించారు. ఈ అంశం శ్రీలంకలో పెను దుమారమే లేపింది. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆ క్ర‌మంలో మోదీ, గౌతమ్ అదానీలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మన దేశంలో ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ, ఐటీ టార్గెట్ చేయడం సాధారణ విషయమేనని, అయితే విద్యుత్ కాంట్రాక్ట్ లపై శ్రీలంక అధికారులు మోదీని టార్గెట్ చేశారని చెప్పారు. అయినప్పటికీ మోదీ కానీ, అదానీ కానీ ఎందుకు స్పందించ‌లేద‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా నిల‌దీశారు.