Site icon HashtagU Telugu

KTR Twitter War: కేంద్రంపై ‘కేటీఆర్’ ట్విట్టర్ వార్!

Ktr Imresizer (1)

Ktr Imresizer (1)

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ‘నువ్వానేనా’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఒకవైపు బీజేపీ నేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తుంటే, మరోవైపు టీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలపై ఫైర్ అవుతున్నారు. గణేష్ నిమజ్జన ఉత్సవాల కార్యక్రమాలకు అసోం సీఎం ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ నేత మైక్ లాగేసుకోవడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆయన మాటతీరు బాగాలేదు’’ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే, అతిథులను గౌరవించుకునేది ఇలాగేనా? అంటూ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు.

ఇక తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాని ఇరకాటంలో నెట్టేయడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. బీజేపీ ప్రభుత్వంపై తరచుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు ఆయన ట్విట్టర్ ను ఆయుధంగా మలుచుకున్నారు. ట్విట్టర్ లో వరుసగా కేంద్ర ప్రభుత్వం వైఫ్యలాలను ఎత్తి చూపుతూ బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్ “మా నీటిపారుదల ప్రాజెక్టులకు ‘జాతీయ ప్రాజెక్ట్’ హోదా ఇవ్వడానికి మీరు నిరాకరించారు. కాళేశ్వరంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మేం సొంతం ఖర్చులతో పూర్తి చేశాం. ఇతర పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం’’ బీజేపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read:   KCR and Jagan: కేసీఆర్ కు ఏపీ సీఎం జ‌గ‌న్ ఫిట్టింగ్‌

కేంద్రం సాయం లేకుండానే తెలంగాణలో 100% ఇళ్లకు తాగునీరు అందించిన రాష్ట్రాల్లో మేం ముందువరుసలో నిలిచాం. దేశంలోనే తెలంగాణ నంబర్ 1 గా నిలిచింది. “మీరు మిషన్ భగీరథకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. మేం మా రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. తెలంగాణ అసమానతలతో ఎలా పోరాడాలో, కలలు కనడం, ఎలా సాధించాలో మాకు తెలుసు” అని కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్.