Site icon HashtagU Telugu

TS : అలా చేస్తే మునుగోడు ఉపఎన్నిక నుంచి తప్పుకుంటాం: మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy

Jagadeesh Reddy

మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఉపఎన్నిక గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ మునుగోడులో ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. మోదీ, అమిత్ షాలకు ఛాలెంజ్ విసిరారు. 18వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధి కి ఇవ్వాలని…అలా చేస్తే తాము ఉపఎన్నిక బరిలో నుంచి తప్పుకుంటామంటూ సవాల్ విసిరారు జగదీశ్ రెడ్డి. బీజేపీ నా చాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే…సీఎం కేసీఆర్ ను ప్రాధేయపడైన ఒప్పిస్తానని తెలిపారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతం ఇఛ్చిన డబ్బులు..మునుగోడు డెవలప్ మెంట్ కోసం ఇవ్వాలన్నారు. డబ్బులు ఇస్తే తమ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటామని…పోటీలో నుంచి తమ అభ్యర్థిని నిలపమన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొరటికల్ గ్రామంలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు వస్తున్న కేంద్ర పెద్దలు ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రికి మోదీ వంద రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలన చూసి…గుజరాత్ ప్రజలు మోదీ ప్రశ్నిస్తున్నారన్నారు.