తెలంగాణ గవర్నర్ తమిళిసై పై ఫైర్ అయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి. గవర్నర్ బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజకీయం చేస్తున్నారని…బీజేపీ కార్యాలయంలో ఒకటి నాంపల్లిలో ఉంటే..రెండవది రాజ్ భవన్ లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో నిన్న ప్రధానమంత్రి మోదీ మాట్లాడరాన్నారు.
మోదీ తెలంగాణకు వచ్చిన ఏం ఇచ్చారంటూ ప్రశ్నించారు. నయా పైసాకూడా ఇవ్వని మోదీ…తెలంగాణ గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలు..దేశంలోనే నెంబర్ వన్ నిలుస్తుందన్న అక్కసు, ఓర్వలేని తనంతోనే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలతోనే బీఆర్ఎస్ దేశం అంతా ప్రచారం చేస్తుందన్నారు. ఆరు బిల్లులను గవర్నర్ ఆమోదించనట్లయితే…న్యాయపరంగా ముందుకు వెళ్తామంటూ హెచ్చరించారు జగదీశ్ రెడ్డి.