Site icon HashtagU Telugu

Harish Rao: శ్రీవారి సేవలో హరీశ్ రావు!

Harish

Harish

తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన. శుక్రవారం ఆయన తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకున్న హరీశ్ రావు.. అక్కడి నుంచి తిరుపతి వెళ్లారు. సాయంత్రం అలిపిరి మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టిన ఆయన.. కాలినడకన తిరుమల (Tirumala) చేరుకున్నారు.

తిరుమలలో శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్ద హరీశ్ రావుకు అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాత్రి విశ్రాంతి తీసుకున్న మంత్రి.. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు హరీశ్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా హరీశ్ రావు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకుంటున్నారు. ఆయన సహచర మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తన పుట్టినరోజు సందర్భగా అభిమానులు, మిత్రులెవరూ హైదరాబాద్‌, సిద్దిపేట రావొద్దని ఇప్పటికే హరీశ్‌రావు ట్విటర్‌ ద్వారా కోరిన విషయం తెలిసిందే. తనపై ఉన్న ప్రేమాభిమానాలను సేవా కార్యక్రమాల ద్వారా చాటాలన్నారు. తనకు సందేశం పంపిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version