Pulse Polio: దేశ వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో.. నిర్ల‌క్ష్యం వ‌ద్ద‌న్న హ‌రీష్ రావు..!

  • Written By:
  • Publish Date - February 27, 2022 / 03:01 PM IST

దేశవ్యాప్తంగా పల్స్​పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల్లో వైకల్యానికి కారణం అయ్యే పోలియో వైరస్ నుంచి బుజ్జాయిలను రక్షించుకునేందుకు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. పోలియో చుక్కల పట్ల ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు విరివిగా చేస్తుండటంతో పోలియో మహ్మమ్మారి జాడ కన్పించడం లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం మొద‌లైంది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేశాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న‌ అన్ని ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీలుతో పాటు గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పోలీయో చుక్కలు వేసే కార్యక్రమం జరగుతుంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటింటికి వెళ్లి సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేయడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా వల్ల పల్స్ పోలియో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రావడంతో మళ్లీ పోలియో చుక్కలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామ‌ని, ఈ క్ర‌మంలో వచ్చే మూడు రోజులు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

ఇందిరాపార్క్ వద్ద పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి హ‌రీష్ రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ కూడా పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో హారీష్ రావు మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్ల పిల్లల వరకు అందరికీ పోలియో డ్రాప్స్‌ వేయాలని తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి హెచ్చరించారు. 20 వేల సెంటర్లలో పోలియో కార్యక్రమం చేపట్టామని.. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయాలని సూచించారు.. ఈ సారి 28 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నామన్న ఆయన.. అనేక మంది పోలియోతో ఇబ్బందులు పడుతున్నారు.. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్ళ పిల్లల వరకు అందరికీ పోలియో డ్రాప్స్‌ వేయాలని తెలిపారు.

పోలియో డ్రాప్స్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఏ కార్యక్రమం చేపట్టినా దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. కరోనా వ్యాక్సిన్‌లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన, కరోనా వాకిన్స్ వేసుకోని వారు ఇప్పుడైనా వేసుకోవాలని సూచించారు. ఇక బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. బస్తీలోని పేదల జ‌బ్బు చేస్తే, పోగొట్టేందుకే హైదరాబాద్ లో 350 బస్తీ దవాఖానాలు సీఎం గారు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌స్తుతం 256 బస్తీ దవాఖానాలు నగరంలో సేవలు అందిస్తున్నాయి. మరో 94 బస్తీ దవాఖానాలు ఈ ఏడాదిలో ప్రారంభిస్తామ‌ని హ‌రీష్ రావు తెలిపారు. ఇక బస్తీ ధవాఖానాలు ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. వైద్య సేవలతో పాటు, మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామని హ‌రీష్ రావు తెలిపారు. బస్తీ ధవాఖానాలు సాయంత్రం కూడా తెరవాలని సూచించామ‌ని, వైద్యాసేవలు ఎప్పుడైనా అందుబాటులో ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.