Site icon HashtagU Telugu

Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!

Harish

Harish

ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని స్వయంగా అక్కడి ఇంజనీర్లే చెప్పుతున్నారన్నారు. 5 ఏళ్లు పట్టే అవకాశం కూడా ఉందంటున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఇంజనీర్లకే తెలియదు. కానీ మన తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసరంగా ప్రతిపక్షాలు ఆందోళణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా అంతకుముందు కూడా ఏపీ టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందని ఏపీ ప్రభుత్వం అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ 73శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందన్నారు. హారీశ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు సీరియస్ అయ్యారు. హరీశ్ కు కౌంటర్లు ఇచ్చారు. దీనికంటే ముందు ఏపీలో కరెంట్ కోతలపైనా హరీశ్ రావు కామెంట్స్ చేశారు. మొత్తానికి అవకాశం దొరికితే చాలు ఏపీ ప్రభుత్వం దుమ్ముదులుపుతున్నారు మంత్రి హరీశ్ రావు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

Exit mobile version