Harish Rao Campaign: మునుగోడులో ముమ్మరంగా హరీశ్ రావు ప్రచారం!

టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీశ్ రావు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామగ్రామాలు తిరుగుతూ ముమ్మర

  • Written By:
  • Publish Date - October 19, 2022 / 03:19 PM IST

టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీశ్ రావు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామగ్రామాలు తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఓటర్లతో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మునుగోడులో ఓటర్లనుద్దేశించి హరీశ్ రావు మాట్లాడారు. “ముక్త కంఠంతో తెరాసా కు ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారు.ప్రజలు చాలా తెలివైనవాళ్ళు.మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ బాధలు తీర్చడానికి కెసిఆర్ ప్రతిన పునారు.కెసిఆర్ ఫ్లోరైడ్ బాధలు తీర్చారు.ఇందులో బిజేపి వాళ్ళ పాత్ర ఏమైనా ఉన్నదా.నీతి అయోగ్ ఒక్క పైసా ఇవ్వలేదు.కానీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కేంద్ర నిధులు అని.ఏ సంక్షేమ పథకంలో ఒక్క పైసా కేంద్రానిది ఉన్నదా.అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చేస్తున్నారు.ఇప్పటికే తాగు నీరు ఇచ్చారు.త్వరలోనే శివాన్నగుడెం రిజర్వాయర్ ను పూర్తి చేసి భూమిలోని ఫ్లోరైడ్ ను తరిమి కొడతాం.కృష్ణా జిల్లాలో వాట తెల్చని బిజేపి కి ఓట్లు అడిగే హక్కు లేదు.

కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న. కృష్ణా జలాల్లో నీళ్ళ వాటా తేల్చాలి.కేంద్రం నిరుద్యోగ లను మోసం చేస్తున్నది.లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.అన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే.రక్షణ శాఖలో కూడా అగ్ని పత్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటున్నారు.ఉన్న ఉద్యోగాలు వూడ బీకుతున్నరు.అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసే కార్యక్రమం ముమ్మరం చేసింది కేంద్రం.బిజేపి అధికారంలో నిరుద్యోగం పెరిగిపోతుంది.బిజేపి వచ్చాక దేశంలో ఆకలి పెరిగింది. 107 స్థానంలో పేదరికం మనది.నేపాల్ పాకిస్థాన్ కంటే వెనకబడి పోయింది.ఇంత కంటే సిగ్గు చేటు ఏముంటుంది.గల్లిగల్లి లో తిరిగే బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలి.ఈ డబ్బుల గురుంచి.రైతు బంధు ప్రయోజనం అత్యధికంగా మునుగోడుకే ప్రయోజనం.ఒక వేళ బిజేపి గెలిస్తే మన బావి కాడికి metres వస్తాయి.జాగ్రత్తగా ఉండాలి”.అని మంత్రి హరీశ్ చెప్పారు.