Telangana BC: మంత్రి గంగుల ‘ఆత్మగౌరవ భవనాల’ రాగం…!

బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కల సాకారమయింది, సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కృషితో నేడు హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో మేర, మేదర కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేశారు.

  • Written By:
  • Publish Date - February 20, 2022 / 07:03 PM IST

బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కల సాకారమయింది, సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కృషితో నేడు హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో మేర, మేదర కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఏక సంఘంగా ఏర్పడిన ఆయా మేర, మేదరి సంఘాల ఆత్మగౌరవ భవన నిర్మాణాల ట్రస్ట్ లు ఈ భవన నిర్మాణాలను చేపడుతున్నాయి, ప్రభుత్వం ఉప్పల్ భగాయత్లో మేర, మేదర కులస్తుల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం చెరో ఎకరా భూమితో పాటు చెరో కోటి రూపాయలు మంజూరు చేసింది.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీలు వెనుకబడిన వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డామన్నారు, స్వాతంత్రం వచ్చిన 74 ఏళ్ల లో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి బీసీలను పట్టించుకోలేదని, కనీస వసతి కోసం గుంట జాగ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ… కేసీఆర్ బీసీ కులాలు ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకాలని హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలాల్ని కేటాయించారని, 41 బీసీ కులాలకు ఎనభై మూడు ఎకరాలు కేటాయించారన్నారు. అంతేకాకుండా భవనాలు నిర్మించుకోవడానికి సైతం ఎకరాకు కోటి రూపాయలు కేటాయించారన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉప్పల్ భగాయత్ లోని మేర, మేదర కులస్తుల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం సంకల్పంతోనే ఇవాళ ఇక్కడ భూమి పూజ నిర్వహించుకుంటున్నాం అన్నారు మంత్రి గంగుల. నారు పోసిన ముఖ్యమంత్రి నీరు పోస్తున్నారని ఈరోజు ముగ్గురం మంత్రులం ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నామని త్వరలోనే ప్రారంభంలో కూడా పాలు పంచుకుంటామన్నారు. ఇప్పటి వరకు 15కుల సంఘాలు ఒక్కతాటి పైకి వచ్చి ఏక సంఘాలుగా ఏర్పడ్డాయని వాటికి అనుమతి పత్రాలు అందచేసామని… వాటిలో రెండింటికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగిందని, మిగతా అన్ని సంఘాలు కూడా ఒక్కతాటి పైకి వచ్చి మార్చ్ 31 లోపల ఏకసంఘంగా ఏర్పడి భవన నిర్మాణాలు ప్రారంభించు కోవాలని ఈ వేదిక ద్వారా కోరారు మంత్రి గంగుల. సీఎం కేసీఆర్ పాలనలో బీసీలుగా పుట్టడం అదృష్టం అన్నారు. ఉన్నత వర్గాలకు దీటుగా బీసీలు సైతం బతకాలని…వేల కోట్లు నిధులు ఇస్తే సరిపోదని వారు ఆత్మ గౌరవంతో ఉండేలా ప్రభుత్వం గౌరవించుకోవాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం అన్నారు మంత్రి గంగుల.

తెలంగాణ పూర్వము 70 ఏళ్ల లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు కేవలం 16 గురుకులాలు మాత్రమే ఏర్పాటు చేసాయని, బీసీ బిడ్డలు కూలి పనులకు వెళ్లకుండా చదువుకుంటారని ఏ ప్రభుత్వాన్ని కోరినా కనీసం కనికరం చూపలేదు అన్నారు. కానీ ఈ రోజు సీఎం బీసీలకు ఉన్నత విద్యను అందించాలని గురుకులాలను 281 పెంచారని కొనియాడారు, గత 70ఏల్లలో కేవలం పదివేల మంది మాత్రమే చదివితే నేడు1,36,000 మంది చదువుతూ ప్రతీ ఏడు లక్షలాది మంది బీసీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారన్నారు మంత్రి గంగుల.

ప్రతి తల్లి తన బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందని, కానీ పెళ్ళికి అవసరమైన డబ్బుల కోసం సొంతింటికి వెల్లి తండ్రిని అడిగినా… అన్నని అడిగినా… ఏ గడప తొక్కినా డబ్బు దొరకని పరిస్థితుల్లో అప్పు చేసి వాటికి మిత్తీలు కట్టలేక గతంలో దుర్భర జీవితం అనుభవించేవారు అన్నారు, కానీ సీఎం కేసీఆర్ పుట్టింది ఏ ఇంటి బిడ్డ అయినా మన తెలంగాణ ఆస్తి అని భావించి వైభవంగా వివాహం జరిపించడం కోసం కల్యాణలక్ష్మి రూపంలో 75 వేల నుండి లక్షా 25 వేల వరకు పెంచిన ఘనత కేసీఆర్ ది అన్నారు. మన బీసీల కోసం ఇంత చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మనం అందరం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వదించాలన్నారు‌. నిండు నూరేళ్లు కేసీఆర్ చల్లగా ఉంటే ఎందరో బీసీల జీవితాలు మారతాయాని అన్ధారు మంత్రి గంగుల కమలాకర్.