Site icon HashtagU Telugu

Green India Challenge: మంత్రి ఇంద్రకరణ్ జన్మదినం.. ‘గ్రీన్’ ఇండియా ఛాలెంజ్ సందేశం!

Indrakaran

Indrakaran

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ (Santosh) తీసుకొచ్చిన గ్రీన్ ఛాలెంజ్ (Green India Challenge) కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో సినీతారలతో పాటు రాజకీయ నాయకులు సైతం భాగమవుతున్నాయి. గ్రీన్ ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటుతూ గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో మొక్క‌లు నాటారు. కాగా ఎంపీ సంతోష్ కుమార్ ట్విట‌ర్ ద్వారా  మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. త‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్ కు మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు చేప‌ట్టిన హ‌రిత‌హారం స్ఫూర్తితో రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా (Green India Challenge) ఛాలెంజ్ కార్యక్రమం  ప్రారంభించారని, పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని ఇంద్రకరణ్ అన్నారు. పర్యావరణ మార్పుల నుంచి ఈ భూమిని రక్షించడానికి ప్రస్తుతం ఉన్న అడవులని కాపాడుకుంటూ, మొక్కలు (Green India Challenge) పెంచడం ఒక్కటే మార్గ‌మ‌ని ఆయన అన్నారు. అందుకు కృషి చేస్తున్న సంతోష్ కుమార్ ను మంత్రి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బిగాల గ‌ణేష్, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు అభిమానులు పాల్గొన్నారు.