Saudi Airport: సౌదీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ వ్యక్తి మృతి.. మరణించిన మూడు వారాల తర్వాత వెలుగులోకి..!

సౌదీ విమానాశ్రయం (Saudi Airport)లో తెలంగాణకు చెందిన మహ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఆ వ్యక్తి మరో గంటలో స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 12:54 PM IST

సౌదీ విమానాశ్రయం (Saudi Airport)లో తెలంగాణకు చెందిన మహ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఆ వ్యక్తి మరో గంటలో స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. తెలంగాణలోని జగిత్యాలలోని కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల పాషా సౌదీ అరేబియాలోని అభా నగరంలో పని చేసేందుకు వెళ్లాడు.

Also Read: Senior Actor Passes Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు మృతి

ఒక నివేదిక ప్రకారం.. మార్చి 2న మహ్మద్ చాంద్ పాషా మరణించగా.. దాదాపు మూడు వారాల తర్వాత మార్చి 20న అతడి మరణ వార్త వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. సౌదీ ఎయిర్‌పోర్టులో వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 2వ తేదీన తిరిగి భారత్‌కు వచ్చేందుకు పాషా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఈలోపే మహ్మద్ చాంద్ పాషాకు గుండెపోటు వచ్చింది. ఇది గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దింతో పాషా అంత్యక్రియలు కూడా సౌదీ అరేబియాలోనే జరిగాయి.