IFS Toppers 2025: ఐఎఫ్ఎస్‌ ఆలిండియా టాపర్లు.. నిఖిల్‌ రెడ్డి, ఐశ్వర్యారెడ్డి నేపథ్యమిదీ

ఓపక్క జిల్లా రవాణాశాఖ  అధికారిణిగా సేవలు అందిస్తూనే.. మరోవైపు ‘ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌’కు వై.ఐశ్వర్యారెడ్డి(IFS Toppers 2025) ప్రిపేర్ అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Chada Nikhil Reddy Yeduguri Aishwarya Reddy Upsc Ifs Results 2025 Ifs Toppers 2025

IFS Toppers 2025: తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్‌ రెడ్డి సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(IFS) పరీక్షలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో నిఖిల్‌ రెడ్డి టాప్ ప్లేస్‌లో నిలిచారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని నిఖిల్ రెడ్డి చెప్పారు. ఈయన తండ్రి చాడ శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి పేరు సునంద. నిఖిల్ రెడ్డి 2018లో ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నరపాట సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశారు.  తదుపరిగా సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. ఫలితంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(IFS) పరీక్షలో నిఖిల్‌కు 11వ ర్యాంకు వచ్చింది. . ఇక దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకును కనికా అనబ్ సాధించారు. రెండో స్థానంలో కందేల్వాల్ ఆనంద్ అనిల్ కుమార్, మూడో స్థానంలో అనుభవ్ సింగ్ నిలిచారు.

Also Read :India Vs Pakistan : ట్రంప్ గాలితీసిన జైశంకర్.. అమెరికా మధ్యవర్తిత్వం అబద్ధమని వెల్లడి

13వ ర్యాంకర్.. యెదుగూరి ఐశ్వర్యారెడ్డి నేపథ్యమిదీ

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(IFS) పరీక్షలో 13వ ర్యాంకు సాధించిన యెదుగూరి ఐశ్వర్యారెడ్డి నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఆమె 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష రాశారు. దాని ఫలితాలు 2022లో విడుదలయ్యాయి.  ఐశ్వర్యారెడ్డికి గ్రూప్ 1లో 18వ ర్యాంకు వచ్చింది. దీంతో రవాణాశాఖలో  ఆర్‌టీఓగా పోస్టింగ్ వచ్చింది. గతేడాది జిల్లా రవాణాశాఖ  అధికారిణిగా ఆమెకు పదోన్నతి ఇచ్చారు. ప్రస్తుతం నంద్యాలలో జాబ్ చేస్తున్నారు.ఓపక్క జిల్లా రవాణాశాఖ  అధికారిణిగా సేవలు అందిస్తూనే.. మరోవైపు ‘ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌’కు వై.ఐశ్వర్యారెడ్డి(IFS Toppers 2025) ప్రిపేర్ అయ్యారు. ఆమె కష్టం ఫలించి ఆలిండియా 13వ ర్యాంకు వచ్చింది. ఐశ్వర్యారెడ్డి సొంతూరు కడప. అమ్మ పేరు పద్మావతి, స్పెషల్‌ క్లాస్‌ కాంట్రాక్టర్. నాన్న వై.రామచంద్రారెడ్డి ఎస్‌.వి.విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్‌గా చేశారు. ఆయన రిటైర్మెంట్  తర్వాత లా కోర్సు పూర్తిచేసి, న్యాయవాదిగా కొత్త కెరియర్‌కు సిద్ధమవుతున్నారు.

Also Read :Powerful Nuclear Missile: పవర్ ఫుల్ అణు క్షిపణి ‘మినిట్‌ మ్యాన్‌-3’.. పరీక్షించిన అమెరికా.. ఎందుకు ?

తెలుగు రాష్ట్రాలకు ర్యాంకులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిఖిల్ రెడ్డి  తర్వాతి ర్యాంకుల్లో మరో 8 మంది ఉన్నారు. యెదుగూరి ఐశ్వర్యారెడ్డి 13వ ర్యాంకు, జి.ప్రశాంత్‌ 25వ ర్యాంకు, చెరుకు అవినాశ్‌ రెడ్డి 40వ ర్యాంకు, చింతకాయల లవకుమార్‌ 49వ ర్యాంకు, అట్ల తరుణ్‌తేజ 53వ ర్యాంకు, ఆలపాటి గోపినాథ్‌ 55వ ర్యాంకు, కె. ఉదయకుమార్‌ 77వ ర్యాంకు, టీఎస్‌ శిశిర 87 వ ర్యాంకులను సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 150 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియను యూపీఎస్‌సీ చేపట్టింది.

  Last Updated: 22 May 2025, 02:17 PM IST