Site icon HashtagU Telugu

Telangana liberation day : సెప్టెంబ‌ర్ 17 చ‌రిత్ర‌, రాజ‌కీయ పార్టీల వైఖ‌రి!

Telangana Liberation Day

Telangana Liberation Day

Telangana liberation day : ప్ర‌తి ఏడాది సెప్టెంబ‌ర్ 17వ తేదీని ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు అన్వ‌యించుకుంటున్నారు. ఆ రోజు రాజ‌కీయ లొల్లి ఎవ‌రూ తీర్చ‌లేన‌ది. విమోచ‌న దినంగా గుర్తిస్తూ కేంద్రం ఈసారి సెప్టెంబ‌ర్ 17వ తేదీని జ‌రుపుతోంది. అందుకోసం అమిత్ షా హైద‌రాబాద్ కు వ‌స్తున్నారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ వేదిక‌గా పెద్ద ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించ‌డానికి క‌మ‌ల‌నాథులు సిద్ధ‌మ‌య్యారు. య‌థాత‌దంగా విద్రోహ దినోత్స‌వాన్ని ఎంఐఎం జ‌రుపుతోంది. కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్స‌వం నిర్వ‌హిస్తోంది. ఇక ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు విముక్తి దినోత్స‌వాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటాయి. ఉద్య‌మ‌పార్టీగా ఉన్నప్పుడు విమోచ‌న దినోత్స‌వం కావాల‌ని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు సెప్టెంబ‌ర్ 17ను స‌మైక్యతా దినోత్స‌వంగా భావిస్తున్నారు.

హైదరాబాద్‌ స్టేట్‌ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్‌ 17వ తేదీని ‘తెలంగాణ జాతీయ సమైక్యతాదినంగా పాటించాలని గ‌త ఏడాది కేసీఆర్ నిర్ణ‌యించారు. ఈ ఏడాది వ‌జ్రోత్స‌వాల ముగింపు 16,17,18 తేదీల్లో ప్రారంభోత్సవాలు జ‌ర‌పాలి. కానీ, గ‌త ఏడాది చెప్పిన మాట‌ల‌ను మ‌రిచిపోయిన కేసీఆర్ 16, 17వ తేదీన పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది.

Also Read : One Election : ఒకే ఎన్నిక‌, ఒకే దేశం అడుగు ముందుకు..

వాస్త‌వంగా ఉమ్మ‌డి ఏపీలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఫ‌క్తు రాజ‌కీయ‌వాదిగా మారిన కేసీఆర్ ఆ డిమాండ్ ను మ‌రిచిపోయారు. మిగిలిన పార్టీలు మాత్రం సెప్టెంబ‌ర్ 17వ తేదీని ప్ర‌తి ఏడాది రాజ‌కీయంగా చూస్తూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఆజాదీకా అమృత‌మ‌హోత్స‌వం ముగింపు, సెప్టెంబ‌ర్ 17 విమోచ‌న దినోత్స‌వం ఒకే రోజు కూడా బీజేపీ జ‌రుపుతోంది. ఆ మేర‌కు బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు హైద‌రాబాద్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు దేశ, రాష్ట్ర రాజ‌కీయాల‌పై కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం రాబోవు ఎన్నిక‌ల దృష్ట్యా క్యాడ‌ర్ కు దిశానిర్దేశః చేయనుంది. తుక్కుగూడ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ బ‌హిరంగ స‌భ, ర్యాలీ జ‌ర‌గ‌నుంది.

సెప్టెంబ‌ర్ 17 చ‌రిత్ర ఏమిటి? (Telangana liberation day)

1948 సెప్టెంబరు 17న, భారత సాయుధ దళాలు “పోలీసు చర్య”లో హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 200 ఏళ్ల నిజాం పాలనకు ముగింపు పలికి, విశాలమైన హైదరాబాద్ దక్కన్ ప్రాంతాన్ని విలీనం చేశాయి. ప్రస్తుత తెలంగాణా, కొన్ని ప్రాంతాలను కలిగి ఉంది. కొన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి.

నిజాం భూస్వామ్య భూస్వాములకు అపారమైన అధికారాలను అందించాడు, వారు ప్రజానీకాన్ని దోపిడీ చేశారు. అతను స్థానిక తెలుగుపై ఉర్దూను బోధనా మాధ్యమంగా మరియు పరిపాలనలో ప్రోత్సహించాడు. విద్య మరియు ఉద్యోగాలను స్థానికులకు అందుబాటులో లేకుండా చేశాడు. దీంతో కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాజకీయంగా క్రియాశీలకంగా మారారు. ఫ్యూడల్ భూస్వాములు మరియు నిజాం పాలనకు వ్యతిరేకంగా 1946 నుండి ప్రారంభమైన తెలంగాణ రైతుల సాయుధ పోరాటం అనే ప్రజా ప్రతిఘటనకు కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు.

రజాకార్లు నిజాం పాలన నుండి ప్రజలను మరింత దూరం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి, రైతాంగ తిరుగుబాటు కారణంగా నిజాం బలహీనంగా మారి, హైదరాబాద్‌లో చేరవలసి వచ్చింది. ఖాసిం రజ్వీ, అలీఘర్-విద్యావంతుడు, నిజాం పాలనలో చివరి సంవత్సరాల్లో రజాకార్లు అని పిలువబడే ప్రైవేట్ మిలీషియాను వ్యవస్థీకృతం చేయడం ద్వారా మరింత ప్రభావం చూపాడు. హైదరాబాదులో ముస్లింల పాలన ముగిసిపోతుందని భయపడిన రజాకార్లు నిజాం పాలనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు దోపిడి, హత్యలు మరియు అత్యాచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.

రజాకార్లు నిజాం పాలన నుండి ప్రజలను మరింత దూరం చేసారు. భారతదేశం జోక్యం చేసుకుని సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను విముక్తి చేయడం ఉత్తమంగా భావించింది. “పోలీసు చర్య” తర్వాత హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మత హింస జరిగింది. ముస్లింలు, మధ్యతరగతిలోని పెద్ద భాగం పాకిస్తాన్ , ఇతర దేశాలకు వలస వెళ్ళాయి. 1956లో, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయబడ్డాయి. మరాఠీ , కన్నడ మాట్లాడే జిల్లాలు వరుసగా మహారాష్ట్ర , కర్ణాటకలతో కలుపబడ్డాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సెప్టెంబరు 17ని విమోచన దినంగా అధికారికంగా జరుపుకుంటున్నప్పటికీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2014 తర్వాత ఈ విషయంలో మౌనం వహించాయి.

Also Read : Pawan Kalyan: పవన్ తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ