Site icon HashtagU Telugu

Monkeypox @ Kamareddy: కామారెడ్డిలో ‘మంకీపాక్స్’ కలకలం

Monkeypox

Monkeypox

దేశంలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నాలుగు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కామారెడ్డి నివాసికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఆ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌లో ఉన్నాడు. అక్కడ అతని శరీరం అంతటా కనిపించిన దద్దుర్లు మంకీ పాక్స్ వ్యాధి కాదా అని తెలుసుకోవడానికి వివిధ పరీక్షలు చేస్తున్నారు. రోగికి చర్మంపై గాయాలు, జ్వరం ఉన్నాయని, అయితే పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.

అయితే, ఇప్పటివరకు దేశంలో నాలుగు కేసులు నమోదుయ్యాయి. ఒకటి ఢిల్లీలో, మరో మూడు కేరళలో వెలుగు చూశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ఆందోళన కలిగించే గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారతదేశంలో నాలుగు వ్యాధి కేసులు నమోదయ్యాయి. ఇది అంటువ్యాధి కాదు అని, ప్రాణాంతకం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. మంకీపాక్స్ విస్తురిస్తున్న నేపథ్యంలో తెలంగాన వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.