Site icon HashtagU Telugu

Telangana Jobs: తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Whatsapp Image 2023 01 27 At 18.39.17

Whatsapp Image 2023 01 27 At 18.39.17

Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శుక్రవారం (జనవరి 27) ట్వీట్ చేశారు. ఈ ఖాళీ పోస్టులను టీఎస్‌పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిల్లో బీసీ గురుకులాల్లో భర్తీ 1,499 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటితోపాటు ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. బీసీ గురుకులాల్లో 153 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.