Telangana: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎం: ప్రధాని మోదీ

రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.

Telangana: రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు . కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ వేల కోట్లు దోచిందన్నారు.

ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం విజయ సంకల్పంలో పాల్గొన్నారు . పటాన్చెరులో సభ ఏమోడీ ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు . కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య అవినీతి బంధం ఉందన్నారు.కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సంబంధాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ప్రధాని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఒకే నాణేనికి రెండు ముఖాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ నాయకుడి అవినీతితో విసిగిపోయి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతి మార్గాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం సర్జికల్ లేదా వైమానిక దాడులు చేసేందుకు వెనుకాడబోదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉన్నత స్థానాల్లో అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ తెలంగాణ ఓటరు ఆశీస్సులు కోరారు.తెలంగాణలో బిజెపి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు, రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 400 కంటే ఎక్కువ సీట్లు సాధించడంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నందున తన విరోధులు తనను ద్వేషిస్తున్నారని, తన కళ్లలోకి నేరుగా చూడలేరని అతను చెప్పాడు. నేను అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను. కుటుంబ పాలిత రాష్ట్రాలు యువతకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు మోడీ. అంతకుముందు పటాన్‌చెరులో రూ.7,200 కోట్ల విలువైన తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

Also Read: Bomb Threat: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి బెదిరింపు ఈమెయిల్