కేసీఆర్ కల నిజమాయే.. ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ!

మిషన్ భగీరథ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మస్తిష్కంలోంచి పుట్టుకొచ్చిన అద్భుతమైన పథకం. కేసీఆర్ అనుకున్నట్టుగా ఈ పథకం మంచి ఫలితాలను అందిస్తోంది. ఇప్పుడు తెలంగాణలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా భగరీథ నీళ్లు పరుగులు పెడుతున్నాయి. ఎంతోమంది దాహం తీరుస్తున్నాయి.

  • Written By:
  • Updated On - November 5, 2021 / 05:53 PM IST

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ఇంటికీ తాగునీరు సరఫరా చేస్తున్న మొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టుకువచ్చిన మిషన్‌ భగీరథతో ఇది సాకారం అయింది. జల్ జీవన్ మిషన్ డేటా ప్రకారం, 2019లో మొత్తం 16.83% కుటుంబాలు కులాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. 2021 నాటికి ఆ సంఖ్య 43.89%కి పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీటిని అందించడం. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ కలుషిత నీరు, నీటి ట్యాంకులపై ఆధారపడడం వంటి సమస్యలు తగ్గాయన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాల ద్వారా తెలంగాణలోని అన్ని గృహాలకు నీరు సరఫరా అవుతుంది.

మిషన్ భగీరథకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, MoD(GOI), నీతి ఆయోగ్ నుంచి ఎన్‌కోమియం అందింది. ఈ తెలంగాణ మోడల్‌ను బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా అనుకరిస్తున్నారు. నీటి సరఫరా రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని నరేంద్ర మోదీ అభినందించారు. మిషన్ భగీరథ నీటి వినియోగ సామర్థ్యాన్ని 20% పెంచే విభాగంలో నేషనల్ వాటర్ మిషన్ అవార్డ్స్ – 2019లో 1వ బహుమతిని, రూ. 2 లక్షల నగదు బహుమతిని అందుకుంది. ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్‌లు, అంతర్గతంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌లకు మిషన్ భగీరథ 2018 స్కోచ్ అవార్డును పొందింది.